PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf6656434-0387-4eb1-841e-fc3252cbf4da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagf6656434-0387-4eb1-841e-fc3252cbf4da-415x250-IndiaHerald.jpgకేసుల్ని నీరుగార్చ‌డం.. నిందితుల్ని ర‌క్షించ‌డం.. అధికార పార్టీ నేత‌లు చెప్పిన‌దాన్ని పాటించ‌డం.. వారెవ‌ర్ని అరెస్ట్ చేయ‌మంటే వారిని అరెస్ట్ చేయ‌డం.. 14 రోజుల రిమాండ్‌కు పంపించ‌డం.. గ‌తంలో ఏ కేసులు లేక‌పోయినా ఏదో ఒక విష‌యంలో.. చివ‌రికి చిన్న న్యూసెన్స్ కేసైనాస‌రే.. న‌మోదు చేయించ‌డం.. జైలుకు పంపించ‌డం.. ఇదీ స్థూలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు చేస్తున్న విధినిర్వ‌హ‌ణ‌. ఒక‌ర‌కంగా వారంతా త‌మ విధివిధానాలు పూర్తిగా మ‌ర్చిపోయారంటే అతిశ‌యోక్తి కాదేమో. పై నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తtag{#}High court;court;Scheduled Tribes;Arrest;Party;policeకేసుల్ని నీరుగార్చు.. నిందితుల్ని ర‌క్షించు??కేసుల్ని నీరుగార్చు.. నిందితుల్ని ర‌క్షించు??tag{#}High court;court;Scheduled Tribes;Arrest;Party;policeSat, 17 Jul 2021 14:34:00 GMT
కేసుల్ని నీరుగార్చ‌డం.. నిందితుల్ని ర‌క్షించ‌డం.. అధికార పార్టీ నేత‌లు చెప్పిన‌దాన్ని పాటించ‌డం.. వారెవ‌ర్ని అరెస్ట్ చేయ‌మంటే వారిని అరెస్ట్ చేయ‌డం.. 14 రోజుల రిమాండ్‌కు పంపించ‌డం.. గ‌తంలో ఏ కేసులు లేక‌పోయినా ఏదో ఒక విష‌యంలో.. చివ‌రికి చిన్న న్యూసెన్స్ కేసైనాస‌రే.. న‌మోదు చేయించ‌డం.. జైలుకు పంపించ‌డం.. ఇదీ స్థూలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు చేస్తున్న విధినిర్వ‌హ‌ణ‌. ఒక‌ర‌కంగా వారంతా త‌మ విధివిధానాలు పూర్తిగా మ‌ర్చిపోయారంటే అతిశ‌యోక్తి కాదేమో. పై నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌లు, నేరాల్ని అదుపు చేయ‌డం, దోపిడీలు, దొంగ‌త‌నాల‌ను నివారించ‌డం, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌టంలాంటివ‌న్నీ వారు ఎప్పుడో మ‌ర్చిపోయారు.

తామే జైలుకెళుతుంటే..
నేర‌స్తుల్ని ప‌ట్టుకొని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టి వారికి శిక్ష ప‌డేలా చేయ‌డంతోపాటు వారు జైలుకు వ‌చ్చిన త‌ర్వాత వారికి స‌త్ప్ర‌వ‌ర్త‌న అల‌వాటు చేయాల్సిన బాధ్య‌త కూడా పోలీసుల‌పైనే ఉంటుంది. కానీ వారే చెప్పిన ప‌నిచేయ‌డంలేదంటూ కోర్టుకు హాజ‌రై న్యాయ‌మూర్తుల‌చేత చీవాట్లు తింటూ వారు జైలుకు వెళుతున్నారు. విజ‌యాడ ఏసీపీ శ్రీ‌నివాస‌రావుకు హైకోర్టు వారం రోజుల జైలుశిక్ష విధించింది. త‌మ ఆదేశాలు అమ‌లు చేయ‌కుండా ఏసీపీ కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి చార్జిషీటు దాఖ‌లు చేయ‌మ‌న్న త‌మ ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డింది.

ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చింది?
ఏపీలో అస‌లు పోలీసుల‌కు ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చింది అంటే అంద‌రికీ అర్థ‌మ‌య్యే విష‌యం ఒక్క‌టే.. అధికార పార్టీ నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్త‌డం. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ కూడా ప‌లుమార్లు హైకోర్టు ఎదుట హాజ‌రై చీవాట్లు తిన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పోలీసులంతా కోర్టు ఆదేశాల‌ను పెడ‌చెవిన పెడుతూ త‌మ ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  ప్ర‌భుత్వ ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనేది వారికే తెలియాలి. రాజ‌కీయ కార‌ణాల‌తో ప‌నిచేయ‌డం పోలీసుల‌కు అల‌వాటైపోయింద‌ని, ఎవ‌రినైనా స‌రే ఎత్తుకెళ్లిపోవ‌డం కూడా బాగా అల‌వాటైందంటూ కోర్టు ఇప్ప‌టికే పోలీసుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌లువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌పై ఇటీవ‌ల కోర్టు ధిక్కార కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధ‌మ‌ని, త‌మ విధి తాము స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తే ఈ ప‌రిస్థి ఉత్ప‌న్న‌మ‌య్యేదికాద‌ని ప్ర‌జ‌లంతా భావిస్తున్నారు.






కేసుల్ని నీరుగార్చ‌డం.. నిందితుల్ని ర‌క్షించ‌డం.. అధికార పార్టీ నేత‌లు చెప్పిన‌దాన్ని పాటించ‌డం.. వారెవ‌ర్ని అరెస్ట్ చేయ‌మంటే వారిని అరెస్ట్ చేయ‌డం.. 14 రోజుల రిమాండ్‌కు పంపించ‌డం.. గ‌తంలో ఏ కేసులు లేక‌పోయినా ఏదో ఒక విష‌యంలో.. చివ‌రికి చిన్న న్యూసెన్స్ కేసైనాస‌రే.. న‌మోదు చేయించ‌డం.. జైలుకు పంపించ‌డం.. ఇదీ స్థూలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు చేస్తున్న విధినిర్వ‌హ‌ణ‌. ఒక‌ర‌కంగా వారంతా త‌మ విధివిధానాలు పూర్తిగా మ‌ర్చిపోయారంటే అతిశ‌యోక్తి కాదేమో. పై నుంచి వ‌చ్చే ఆదేశాల మేర‌కు మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌లు, నేరాల్ని అదుపు చేయ‌డం, దోపిడీలు, దొంగ‌త‌నాల‌ను నివారించ‌డం, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌టంలాంటివ‌న్నీ వారు ఎప్పుడో మ‌ర్చిపోయారు.

ఆ ప్రముఖ నాయకుడు అతను ఏ పార్టీలో ఉన్నాడో తెలియట్లేదటా..?

రానున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి స‌భ‌ను స్తంభింపచేస్తామ‌ని ప్ర‌క‌టించారుకానీ అది హోదా విష‌యం కాద‌ని, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును స‌స్పెండ్ చేయాల‌నే విష‌య‌మ‌ని స్ప‌ష్ట‌త వ‌చ్చింది. అయితే తాజాగా పార్టీ అధిష్టానం స‌భ‌ను స్తంభింప‌చేయాలంటూ ఆదేశించింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్‌పై బీజేపీ పెద్ద‌ల ఆగ్ర‌హం?

`స‌మాజ్‌వాదీ పార్టీ` నిర‌స‌న‌లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

బ్రేకింగ్ : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

కూతురు మిస్సింగ్..మనస్థాపంతో తండ్రి సూసైడ్..!

ఆ వైసీపీ మ‌హిళా ఎంపీ సీటుకు గండం మొద‌లైంది ?

ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>