PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/up99c3a13b-8f4d-4ece-9ad6-e9d0e906e79a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/up99c3a13b-8f4d-4ece-9ad6-e9d0e906e79a-415x250-IndiaHerald.jpgఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో సమాజ్ వాదీ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. దీనికి నిర‌స‌న‌గా గురువారం నాడు స‌మాజ్‌వాదీ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాup{#}Panchayati;Arrest;thursday;CM;police;Pakistan;Friday;Party;Bharatiya Janata Party`స‌మాజ్‌వాదీ పార్టీ` నిర‌స‌న‌లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?`స‌మాజ్‌వాదీ పార్టీ` నిర‌స‌న‌లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?up{#}Panchayati;Arrest;thursday;CM;police;Pakistan;Friday;Party;Bharatiya Janata PartySat, 17 Jul 2021 14:00:52 GMTఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో సమాజ్ వాదీ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. దీనికి నిర‌స‌న‌గా గురువారం నాడు స‌మాజ్‌వాదీ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనంత‌రం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితులపై  147, 188, 269, 270, 153బీ, 505(2) 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రకటించారు.


అనంత‌రం స‌మాజ్‌వాదీ పార్టీ నేతలు మాట్లాడుతూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తులు తమ పార్టీ వారు కాద‌ని కేవ‌ల తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఈ విధంగా చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టు తెలిసిందని ఆ వ్యక్తి పై చర్య తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.


 బిజెపి ఉత్తరప్రదేశ్ నేతలు మాట్లాడుతూ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం దారుణమని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సంబంధించిన వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరియు సమాజ్‌వాదీ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే విషయం రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి సమాజ్‌వాది పార్టీ జెండా ఎగరేస్తాం అని ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇరుపార్టీలు పొత్తు పెట్టుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజయం సాధించిన విష‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌మ పార్టీ గెల‌వాల‌ని స‌మాజ్ వాదీ పార్టీ నేత‌లు, మ‌ళ్లీ త‌మ విజ‌యాన్ని రిపీట్ చేయాల‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు స‌మాచారం.



బ్రేకింగ్ : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

ఇదంతా ఈటలను ఓడించడానికేనా..?

కూతురు మిస్సింగ్..మనస్థాపంతో తండ్రి సూసైడ్..!

య‌మునా న‌దిలో విష‌పు నురుగు.. !

ఆ వైసీపీ మ‌హిళా ఎంపీ సీటుకు గండం మొద‌లైంది ?

జోడు పదవులకు జగన్ బ్రేక్

ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?

కోడలిపై కక్ష పెంచుకున్న మామ..కుమారుడు లేని టైంలో ఏంచేశాడంటే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>