PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/monkey-pox-these-are-the-symptoms-of-the-new-disease6e87b4a7-4b76-4e9b-b362-c1c3bd46bfc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/monkey-pox-these-are-the-symptoms-of-the-new-disease6e87b4a7-4b76-4e9b-b362-c1c3bd46bfc6-415x250-IndiaHerald.jpgమంకీపాక్స్.. అనే వ్యాధి అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చింది. నైజీరియాకు వెళ్లొచ్చిన ఒక వ్యక్తికి ఈ వ్యాధి సోకడంతో ఆ దేశం వణికిపోతోంది. బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరంపై పెద్దపెద్ద దద్దుర్లు వచ్చిన లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. monkey pox{#}Singapore;Chicken;American Samoa;Coronavirus​మంకీ పాక్స్.. కొత్త వ్యాధి లక్షణాలు ఇవే..!​మంకీ పాక్స్.. కొత్త వ్యాధి లక్షణాలు ఇవే..!monkey pox{#}Singapore;Chicken;American Samoa;CoronavirusSat, 17 Jul 2021 23:21:40 GMTఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడి పోయాం. ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ తో నరక యాతన అనుభవించాం. ఇక మూడో వేవ్ కూడా బెదరగొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త వ్యాధి ఎంటర్ అయిపోయింది. భయంకరమైన లక్షణాలతో వణికించేస్తోంది.
అమెరికాకు లోని టెక్సాకు చెందిన ఒక వ్యక్తికి మంకీ పాక్స్ అనే వ్యాధి సోకింది. ఇంకేముందీ అక్కడి వారిలో కొత్త భయం పట్టుకుంది. ఆ దేశంలో మంకీ పాక్స్ సోకిన తొలి వ్యక్తి అతనే కావడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవలే నైజీరియాకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తికి కొత్త వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. బాధితుడిని ప్రత్యేకంగా వార్డులో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.  

మంకీపాక్స్ తో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అమెరికా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, ప్రయాణించడం లాంటివి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.  మంకీ పాక్స్.. దాదాపు చికెన్ పాక్స్ లాంటి లక్షణాలు కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వ్యాధి సోకిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. సాధారణంగా ఈ వ్యాధి సోకినపుడు తగ్గడానికి నాలుగు వారాల సమయం పడుతుంది. ఒక వేళ బాధితుడు తుమ్మితే ఆ తుంపర్ల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.  

మంకీ పాక్స్ సోకితే.. ముఖం, శరీరంపై పెద్దపెద్ద దద్దుర్లు వస్తాయి. ఈ వ్యాధి ఎలుకలు, కుందేళ్ల ద్వారా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది. అంతేకాదు బ్రిటన్, ఇజ్రాయెల్, సింగపూర్ లో కూడా మంకీ పాక్స్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కరోనాకు టీకా అయితే వచ్చింది కానీ.. మంకీ పాక్స్ కు టీకా లేదు.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఈ వ్యాధి లక్షణాలు ఎవరికైనా బయటపడితే వెంటనే వైద్యులను సంప్రదించండి. కరోనా వైరస్ సోకకుండా ఎలాగైతే మాస్క్ లు ధరిస్తున్నారో.. ఆ విధానాన్ని కొనసాగించండి. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోండి. వ్యాయామం రోజూ చేసేలా ప్లాన్ చేయండి.  



 



ఆగలేక పోతున్నారు.? చూపించండి..!

రేపటి నుండే థియేటర్లు ఓపెన్... శుభారంభం ఇస్తాయా ?

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్?

బిగ్ రివీల్... ఆ పాపులర్ షోకు హోస్ట్ సల్మాన్ కాదు...!!

కొడుకును ఆ హీరో చేతిలో పెట్టి కన్ను మూసిన నటి అశ్విని

రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...?

ఈగల్ ముందు డ్రాగన్ ఆటలు సాగవు..!

ఫేస్బుక్ ప్రాణాలు తీస్తుంది.. జో బైడెన్ షాకింగ్ కామెంట్స్?

ఓకే మ్యాచ్.. రెండు జట్లు.. రెండు రికార్డులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>