PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycpbf743fcc-d2f7-4838-a812-214b0d347d84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycpbf743fcc-d2f7-4838-a812-214b0d347d84-415x250-IndiaHerald.jpgఅనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అద‌ర‌హో.. అనిపించేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. అదేస‌మ‌యంలో నిల‌క‌డ‌లేని.. రాజ‌కీయాలు సాగే నియోజ‌క‌వ‌ర్గంగా కూడా పేరుంది. ఇక్క‌డ జ‌రిగిన వ‌రుస‌మూడు ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఏ పార్టీని ఇక్క‌డ ప్ర‌జ‌లు వ‌రుస‌గా గెలిపించ‌లేదు. 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నాయి. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప‌రిస్థితి ఇక్క‌డ దారుణంగా త‌TDP YCP{#}TDP;YCP;District;Congress;Partyవైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?TDP YCP{#}TDP;YCP;District;Congress;PartySat, 17 Jul 2021 11:20:00 GMTఅనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అద‌ర‌హో.. అనిపించేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. అదేస‌మ‌యంలో నిల‌క‌డ‌లేని.. రాజ‌కీయాలు సాగే నియోజ‌క‌వ‌ర్గంగా కూడా పేరుంది. ఇక్క‌డ జ‌రిగిన వ‌రుస‌మూడు ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఏ పార్టీని ఇక్క‌డ ప్ర‌జ‌లు వ‌రుస‌గా గెలిపించ‌లేదు. 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నాయి. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప‌రిస్థితి ఇక్క‌డ దారుణంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే ఇక్క‌డ రాజకీయం న‌డుస్తోంది.

టీడీపీ-వైసీపీల నేత‌లు ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ప్ర‌ధానంగా ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న‌వారే గెలుస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి.. వైసీపీ, టీడీపీల‌కు స‌మానంగా ప‌డింది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి జితేంద‌ర్ గౌడ్ విజ‌యం ద‌క్కించుకున్నా.. ఆయ‌న మెజారిటీ కేవ‌లం 5 వేల పైచిలుకు ఓట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక‌, అదే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన‌.. వెంక‌ట్రామ‌రెడ్డి.. దాదాపు గెలుపు గుర్రం ఎక్కేదాకా వ‌చ్చి ఆగిపోయారు. అంటే.. అంత ట‌ఫ్ ఫైట్ న‌డిచింది.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. టీడీపీ దాదాపు చ‌తికిల ప‌డింద‌నే చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌడ్‌కే చంద్ర‌బాబు టికెట్ ఇచ్చినా.. ఆయ‌న ఆశించిన ప్ర‌భావం చూపించ‌లేక పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన వెంక‌ట్రామ‌రెడ్డి దాదాపు 49 వేల ఓట్ల పైచిలుకు రాబ‌ట్టి ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థి అలెర్ట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ళ్లీ గెలుస్తుంద‌ని.. ఒక ఎన్నిక‌ల్లో ఓడితే.. మ‌రో ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వేసుకుంటూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. అదేస‌మ‌యంలో

అధికార పార్టీ ఎమ్మెల్యే వెంక‌ట్రామ‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతానేమో.. అనే భ‌యంతో ఆయ‌న కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. మొత్తానికి ఇద్ద‌రు నేత‌లూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న చాలా త‌క్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంత‌క‌ల్లు ఒక‌టిగా నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌జ‌ల‌కు కూడా ఇలాంటి నేత‌లే కావాల‌ని అక్క‌డ చ‌ర్చ మొదలైంది.



ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

జగ‌న్ ఆశ‌ ఇప్ప‌ట్లో తీర‌దు.. రాజ‌కీయం ఇప్ప‌ట్లో పార‌దు...!

ఏపీలో తెలుగుదేశం పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో తగిన గుర్తింపు లేదని శోభా హైమావ‌తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శోభా హైమావతి గతంలో ఎస్ కోట ఎమ్మెల్యే గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు గా కూడా పనిచేశారు.

టీడీపీకి బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. !

గుంత‌క‌ల్లులో నిత్య ప్ర‌జాసేవ‌లో ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ గౌడ్‌..!

కేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. మ‌ధ్య‌లో ఈ ట్విస్ట్ ఏంటో..?

ఏపీ: మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా.. అంతర్గత రాజకీయాలు భరించలేకే పార్టీ వీడుతున్నా-శోభా హైమావతి

పిలిస్తే పలకనా బా...? తుమ్మలకు కేసీఆర్ ఆహ్వానం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>