Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh6d9593f9-e16b-448a-a1d5-08563b0ca290-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh6d9593f9-e16b-448a-a1d5-08563b0ca290-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ పై తాజాగా స్పందించారు విక్టరీ వెంకటేష్. మా ఎలక్షన్స్ గొడవపై ఓ రేంజ్ లో స్పందిస్తారని అనుకున్న వెంకటేష్ కాస్త ఒక్క మాటలో తేల్చేసి చెప్పారు. ఓ పక్క ఈసారి మా ఎన్నికల్లో ఐదుగురు పోటీలో నిలబడుతుండగా ఎవరికి వారు ప్రెస్ మీట్ లు పెట్టి వారి వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క సినీ పెద్దలంతా కలిసి అసలు ఎలక్షన్స్ లేకుండాVenkatesh-MAA-Elections {#}manchu vishnu;Nagababu;Election;Balakrishna;Yevaru;Venkatesh;Tollywood;Pressమా ఎలక్షన్స్ రగడ.. ఒక్కమాటలో తేల్చేసిన వెంకటేష్..!మా ఎలక్షన్స్ రగడ.. ఒక్కమాటలో తేల్చేసిన వెంకటేష్..!Venkatesh-MAA-Elections {#}manchu vishnu;Nagababu;Election;Balakrishna;Yevaru;Venkatesh;Tollywood;PressSat, 17 Jul 2021 17:00:00 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ పై తాజాగా స్పందించారు విక్టరీ వెంకటేష్. మా ఎలక్షన్స్ గొడవపై ఓ రేంజ్ లో స్పందిస్తారని అనుకున్న వెంకటేష్ కాస్త ఒక్క మాటలో తేల్చేసి చెప్పారు. ఓ పక్క ఈసారి మా ఎన్నికల్లో ఐదుగురు పోటీలో నిలబడుతుండగా ఎవరికి వారు ప్రెస్ మీట్ లు పెట్టి వారి వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క సినీ పెద్దలంతా కలిసి అసలు ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక జరగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు మా అధ్యక్షుడు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈమధ్యనే నందమూరి బాలకృష్ణ కూడా మా ఎలక్షన్స్ గురించి స్పందించారు. తెలంగాణా ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్న సినీ పెద్దలు మా భవనం కోసం ఒక ఎకరం భూమి సంపాదించలేరా అని అన్నారు. అయితే దీనికి నాగబాబు కౌంటర్ కూడా వేశారు. అయితే మంచు విష్ణు తానే స్వయంగా తమ ఫ్యామిలీ సపోర్ట్ తో మా బిల్డింగ్ కడతామని అని చెప్పేశారు. మంచు విష్ణు కడతానంటే అందులో తాను భాగస్వామ్యం అవుతానని అన్నారు బాలయ్య.

మా ఎలక్షన్స్ పై వెంకటేష్ మాత్రం చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ వెంకీ ఏమన్నారు అంటే ఏదీ మన చేతుల్లో లేదు ఉండదు.. ఏదైనా జరగొచ్చు.. అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మాట్లాడారు. అంతేకాదు ఎలక్షన్స్ టైం లో జరిగే గొడవలేవి శాశ్వతం కాదని ఆయన అన్నారు. వెంకటేష్ చెప్పిన పాయింట్ లో కూడా లాజిక్ ఉంది. ఒకసారి ఎన్నిక పూర్తయితే మళ్లీ రెండేళ్ల పాటు ఎవరి పనులు వారు చూసుకుంటారు. మొత్తానికి మా ఎలక్షన్స్ పై వెంకీ చేసిన కామెంట్స్ అందరిని మెప్పిస్తున్నాయి. టాలీవుడ్ మిస్టర్ కూల్ వెంకీ మా ఎలక్షన్స్ పై చేసిన కామెంట్స్ మరోసారి ఆయన మంచి తనాన్ని తెలియచేస్తున్నాయి.
 



రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...?

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?

పెళ్లి పీటలమీద విడిపోయిన జంటలు..

బాలయ్య ను ఆయన వదిలేయడానికి కారణం అదే?

నా చేతుల్లో ఏమీ లేదు.. క్షమించండి.. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు..!

తప్పతాగి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>