CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-28415f48-fe3a-436c-92ca-23161c8b4359-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-28415f48-fe3a-436c-92ca-23161c8b4359-415x250-IndiaHerald.jpgమనిషికి క్షణికావేశం చాలా ప్రమాదకరం. అప్పుడు పట్టలేనంత కోపంలో ఆలోచనా జ్ఞానాన్ని, విచక్షణను మరిచి మృగంగా ప్రవర్తిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో క్షణికావేశం రెండు ప్రాణాలను బలికొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. murder {#}Wife;local language;policeకోడలిపై కక్ష పెంచుకున్న మామ..కుమారుడు లేని టైంలో ఏంచేశాడంటే..!కోడలిపై కక్ష పెంచుకున్న మామ..కుమారుడు లేని టైంలో ఏంచేశాడంటే..!murder {#}Wife;local language;policeSat, 17 Jul 2021 11:18:06 GMTమనిషికి క్షణికావేశం చాలా ప్రమాదకరం. అప్పుడు పట్టలేనంత కోపంలో ఆలోచనా జ్ఞానాన్ని, విచక్షణను మరిచి మృగంగా ప్రవర్తిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో క్షణికావేశం రెండు ప్రాణాలను బలికొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రాపూర్లో నివాసం ఉంటున్న వ్యక్తికి భార్య ఒక కుమారుడు. భార్య ఆనారోగ్యంతో మంచాన పడింది. తన కోడలు తమను బాగా చూసుకోవటం లేదని ఆ వ్యక్తి కోడలిపై బాగా కోపాన్ని పెంచుకున్నాడు. తరుచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఒక్కోసారి కుమారుడు అడ్డొచ్చి సద్దుమణిగించేవాడు. దాంతో ఆ వ్యక్తి కోడలిపై బాగా కక్ష పెంచుకున్నాడు. తనను ఎలా అయినా హతమార్చాలనుకున్నాడు. మంచి అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాడు.

ఇదే సమయంలో పని మీద కుమారుడు బయటకు వెళ్లాడు. అంతే ఆ మామలో ఉన్న కృరత్వం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. మృగంగా విరుచుకుపడ్డాడు. కొడలితో తన భార్యను ఎందుకు సరిగా చూసుకోవటం లేదు. ఎందుకు అన్నం పెట్టటం లేదని గొడవపడ్డాడు. ఆమెను కిందకు నెట్టి గొంతిపై కాలు వేసి గట్టిగా నొక్కాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇంక బతికుండి ఏం లాభం..నిన్ను చూసుకోవటానికి కూడా ఎవరూ లేరు అనుకున్నాడో ఏమో భార్యను కూడా గొంతునులిమి చంపేశాడు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. జంటహత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే భార్య చనిపోయింది. కోడలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, కొద్ది గంటలకే ఆమె కూడా చనిపోయింది. ఈ విషయం మొత్తాన్ని పని మీద బయటకు వెళ్లిన కుమారుడికి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. అది విన్న అతని కుమారుడు షాక్ కు గురయ్యాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.



ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

తండ్రి పేరు నిలబెడుతున్న కమెడియన్ రాజా బాబు కొడుకులు.. ఏం చేస్తున్నారో తెలుసా ?

అంగ‌న్వాడీ పాల‌ప్యాకెట్ల‌తో టీచ‌ర్ భ‌ర్త వ్యాపారం.. !

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఆ మాజీ క్రికెట‌ర్‌..?

సుహాసిని సొగసుకు బుక్కయినా వారు ఇంతమంది ఉన్నారా..?

నాగబాబు సతీమణి ఎవరి కుమార్తె తెలుసా ?

సినీఫక్కీలో కిడ్నాప్..అమ్మాయిని కారులోకి లాగి!

కల్తీ మద్యం తాగి.. 16 మంది మృతి..!

కాల్పులతో ఉలిక్కిపడ్డ కరీంనగర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>