PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan14ac21fe-eec1-446a-812f-18e705a0b45e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan14ac21fe-eec1-446a-812f-18e705a0b45e-415x250-IndiaHerald.jpgసాఫ్ట్‌వేర్.. ఇప్పుడు యువతకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రంగం అదే.. ఇప్పుడు యువత ఎక్కువగా ఎంచుకుంటున్న రంగం కూడా అదే. సాఫ్ట్‌వేర్‌ అంటే చక్కటి జీతాలు.. వారానికి ఐదు రోజుల పని.. తరచూ పెరిగే వేతనాలు.. వైట్ కాలర్ జాబ్.. ఇలా సాగుతాయి యువత ఆలోచనలు. ప్రభుత్వాలు కూడాఈ ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలను తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఇదే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వం 2021-24 ఐటీ పాలసీని విడుదల చేసింది. ఈ ఐటీ పJAGAN{#}Panchayati;nidhi;Jagan;Governmentజగన్ టార్గెట్‌: మూడేళ్లలో 55 వేల సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌..?జగన్ టార్గెట్‌: మూడేళ్లలో 55 వేల సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌..?JAGAN{#}Panchayati;nidhi;Jagan;GovernmentSat, 17 Jul 2021 08:09:00 GMTసాఫ్ట్‌వేర్.. ఇప్పుడు యువతకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రంగం అదే.. ఇప్పుడు యువత ఎక్కువగా ఎంచుకుంటున్న రంగం కూడా అదే. సాఫ్ట్‌వేర్‌ అంటే చక్కటి జీతాలు.. వారానికి ఐదు రోజుల పని.. తరచూ పెరిగే వేతనాలు.. వైట్ కాలర్ జాబ్.. ఇలా సాగుతాయి యువత ఆలోచనలు. ప్రభుత్వాలు కూడాఈ ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలను తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తున్నాయి.


ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఇదే ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వం 2021-24 ఐటీ పాలసీని విడుదల చేసింది. ఈ ఐటీ పాలసీ ప్రకారం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే.. ఈ రంగం ద్వారా పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్లేలా ఐటీ పాలసీ రూపొందించింది.


ఐటీ రంగాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు ఇన్‌క్యూబేషన్‌ సెంటర్లు, స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సర్కారు తమ ఐటీ పాలసీలో నిర్ణయించింది. అందుకే స్టార్టప్స్‌ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇచ్చేలా ప్రత్యేకంగా ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ పాలసీలో పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో  రూ.  783 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఐటీ రంగం ద్వారా ఉద్యోగుల జీతాలు, ఖర్చులు, తద్వారా  రూ. 2200 కోట్లు ప్రతి ఏడాది ఆదాయం రావచ్చని  ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. వర్క్‌ ఫ్రమ్‌ ఎనీవేర్‌ విధానానికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ రంగం దిశగా విద్యార్థులను ఆకట్టుకునేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.



ఈ ఉదయం 11 గంటలకు ఏపీ ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన రానుంది. వైసీపీలోని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ఉదయం11 గంటలకు నామినేటెడ్ పోస్టులను ఏపీ సర్కారు ప్రకటించబోతోంది. నామినేటెడ్‌ పోస్టులు ఎవరెవరికి ఇస్తున్నదీ ఆ వివరాలు ప్రకటించబోతున్నారు.

ఉదయం 11 గంటలకు సంచలన ప్రకటన..!

సరిహద్దు వివాదాలపై ర‌క్ష‌ణ శాఖ‌ కీలక భేటీ.. ఇక చైనాకు చుక్కలే..!

పల్లెల్లో జగన్ పై వ్యతిరేకత..! ఎందుకంటే..?

టార్గెట్ సజ్జల: జగన్‌కు ఇబ్బందేనా?

ఒకే పదవికోసం లోకేష్, పవన్ పోటీ..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ మేకపాటికి తిరుగులేదా?

పవన్ తర్వాత....చినబాబు పెద్దగా చేసేలా ఉన్నారే..!

టీడీపీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>