PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-cabinet-changesb7f2ab6f-b484-4889-8732-c145a79bb7a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-cabinet-changesb7f2ab6f-b484-4889-8732-c145a79bb7a3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. సీఎం జగన్ ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. మొదటిసారి సీఎంగా ఉన్న జగన్ ఎంతో అనుభవమున్న వాడిలా ప్రజల అవసరాలను ముందే గ్రహించి మానిఫెస్టోలో లేని హామీలను సైతం నెరవేర్చుతున్నాడు. AP-CABINET-CHANGES{#}PUSHPASREEVANI PAMULA;Mekathoti Sucharitha;Deputy Chief Minister;Chilakaluripeta;Nagari;Cabinet;Minister;News;December;Roja;Yevaru;Jagan;YCP;CMకేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?కేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?AP-CABINET-CHANGES{#}PUSHPASREEVANI PAMULA;Mekathoti Sucharitha;Deputy Chief Minister;Chilakaluripeta;Nagari;Cabinet;Minister;News;December;Roja;Yevaru;Jagan;YCP;CMSat, 17 Jul 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. సీఎం జగన్ ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. మొదటిసారి సీఎంగా ఉన్న జగన్ ఎంతో అనుభవమున్న వాడిలా ప్రజల అవసరాలను ముందే గ్రహించి మానిఫెస్టోలో లేని హామీలను సైతం నెరవేర్చుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నాయకుల దృష్టి అంతా జరగబోయే మంత్రివర్గ మార్పు పైనే నెలకొంది. ముందుగానే చెప్పిన విధంగా రెండున్నరేళ్ల తరువాత మంత్రి మార్పు జరగనుంది. అయితే సమాచారం ప్రకారం డిసెంబర్ లోపు ఈ మార్పు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రి పదవి దక్కిన వారిలో ఎవరెవరు తిరిగి కొనసాగనున్నారు ? ఎవరెవరు కొత్త వారు కేబినెట్ లో చోటు దక్కించుకోనున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పుడు కేబినెట్ లో కొనసాగుతున్న మహిళా మంత్రులపైన ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం మహిళా మంత్రులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. వారిలో హోం మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత జగన్ కు బాగా దగ్గరవడంతో ఈమె మంత్రిగా సేఫ్ అయినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ఇద్దరి మంత్రులపై వేటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

డిప్యూటీ సీఎం గా ఉన్న పుష్ప శ్రీవాణి అలాగే తానేటి వనితలు ఇద్దరినీ మంత్రి పదవి నుండి తప్పిస్తారని వార్తలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వారు ఎవరు మంత్రి పదవులను దక్కించుకుంటారనే దానిపై ఆసక్తి కలుగుతోంది. మరి కొత్త మంత్రులు ఎవరో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంది. అంతే కాకుండా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు. మరిం జగన్ ఎప్పుడూ ఊహకందని విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని తెలిసిందే. ఈ సారి ఎటువంటి షాక్ ఇస్తారో చూడాలి.



ఆనంద్ దేవరకొండ హైవే లో నటిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. మ‌ధ్య‌లో ఈ ట్విస్ట్ ఏంటో..?

తండ్రి పేరు నిలబెడుతున్న కమెడియన్ రాజా బాబు కొడుకులు.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఐస్‌క్రీమ్-3ను భారీగా ప్లాన్ చేస్తున్న ఆర్జీవీ..?

కుప్పింటాకు ఉపయోగాలు ఎన్నో తెలుసా..?

పిలిస్తే పలకనా బా...? తుమ్మలకు కేసీఆర్ ఆహ్వానం...?

మాన్స‌స్ భూముల వ్యవ‌హారంపై స్పందించిన ఊర్మిళ గ‌జ‌ప‌తి రాజు.. !

జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ మృతిపై తాలిబన్లు షాకింగ్ కామెంట్స్ ?

కేంద్ర ద‌గ్గ‌ర ప‌ట్టు జ‌గ‌న్‌దా... కేసీఆర్‌దా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>