PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6fd2d38b-3ab9-4e73-af11-9171a68be3e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6fd2d38b-3ab9-4e73-af11-9171a68be3e1-415x250-IndiaHerald.jpgకరోనా థర్డ్‌ వేవ్ గురించి అంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆ దేశంలో అప్పుడే కరోనా మూడో దశ మొదలైనట్టు కనిపిస్తోంది. అక్కడ కరోనా మొదలైనప్పటి నుంచి అత్యధికంగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకూ తీవ్రం అవుతోంది. అక్కడ వరుసగా నాలుగో రోజు కరోనా మరణాల సంఖ్య సరికొత్త రికార్డు నమోదు చేసింది. రష్యాలో శుక్రవారం మరో 799 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో కరోనా మొదలైన నాటి నుంచి సంభవించిన ఒక్కరోజు మరణాల్లో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం. రష్యాలో జూన్ మొదటి వారంలో సరాసరి 9వేలుగా ఉన్న రోcoronavirus{#}Russia;Coronavirus;June;American Samoa;Fridayఆ దేశంలో థర్డ్ వేవ్‌ జోరు.. గరిష్టస్థాయిలో మరణాలు..ఆ దేశంలో థర్డ్ వేవ్‌ జోరు.. గరిష్టస్థాయిలో మరణాలు..coronavirus{#}Russia;Coronavirus;June;American Samoa;FridaySat, 17 Jul 2021 08:04:00 GMTకరోనా థర్డ్‌ వేవ్ గురించి అంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆ దేశంలో అప్పుడే కరోనా మూడో దశ మొదలైనట్టు కనిపిస్తోంది. అక్కడ కరోనా మొదలైనప్పటి నుంచి అత్యధికంగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ  అంతకంతకూ తీవ్రం అవుతోంది. అక్కడ వరుసగా నాలుగో రోజు కరోనా మరణాల సంఖ్య సరికొత్త రికార్డు నమోదు చేసింది. రష్యాలో శుక్రవారం మరో 799 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో కరోనా మొదలైన నాటి నుంచి సంభవించిన ఒక్కరోజు మరణాల్లో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం.


రష్యాలో జూన్ మొదటి వారంలో సరాసరి 9వేలుగా ఉన్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 25 వేలు దాటుతోంది. రష్యాలో తాజాగా 25 వేల 705 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అయితే ఈ కరోనా విజృంభణకు డెల్టా వేరియింట్ ప్రధానం కారణంగా  భావిస్తున్నారు. అంతే కాదు.. ఇతర దేశాలతో పోలిస్తే.. రష్యాలో టీకాల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోంది. రష్యా మొత్తం జనాభాలో  ఇప్పటివరకు ఐదో వంతు మందికి కూడా కరోనా టీకా ఇవ్వలేదు. ఇక మొత్తం లెక్కలు చూస్తే.. రష్యాలో ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకూ రష్యాలో లక్షా 50వేల పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.


రష్యాలో తాజా కరోనా విజృంభణ చూస్తే.. కరోనా థర్డ్ వేవ్‌ మొదలైనట్టే అంటున్నారు నిపుణులు. కేవలం రష్యాలోనే కాదు.. ప్రపంచమంతటా అదే ట్రెండ్ నడుస్తోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ కూడా తెలిపారు. అమెరికా మినహా దాదాపు మిగిలిన దేశాల్లో కరోనా పరిస్థితి అధ్వానంగా మారుతోందని ఆయన వివరించారు. మొత్తం మీద ప్రపంచం మూడో దశ వైపు పయనిస్తోందన్నది కాదనలేని వాస్తవమని ఆయన కుండబద్దలు కొట్టేశారు.


ఈ సూచనను ప్రమాదకర హెచ్చరికగా భావించి ముందుకు వెళ్లాలని వీకే పాల్ సూచిస్తున్నారు. మన  దేశంలోనూ ఇంతవరకూ హెర్డ్‌ ఇమ్యూనిటీ రాలేదని... ఇంకా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోందని.. అంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇండియాలో  కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. అంతే కాదు... కేసుల సంఖ్య తగ్గే క్రమం కూడా తగ్గిపోతోంది. ఇది మూడో దశకు సంకేతం అంటున్న నిపుణులు.. దేశంలో కరోనా మూడో దశ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉందన్నారు.



అలర్ట్ : వరుసగా కామన్ ఎంట్రన్స్ పరీక్షలు.. తేదీలు ఇవే?

ముగ్గురు పిల్లలు, తల్లి అనుమానాస్పద మృతి

పల్లెల్లో జగన్ పై వ్యతిరేకత..! ఎందుకంటే..?

హైదరాబాద్ లో సోనూసూద్ మకాం... అసలు ప్లాన్ ఇదే ?

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకూ తీవ్రం అవుతోంది. అక్కడ వరుసగా నాలుగో రోజు కరోనా మరణాల సంఖ్య సరికొత్త రికార్డు నమోదు చేసింది. రష్యాలో శుక్రవారం మరో 799 మరణాలు నమోదయ్యాయి.

తాలిబన్ దాడులకు బలైన ఇండియన్ ఫోటో జర్నలిస్ట్..

నిరుద్యోగులకు తీపి కబురు.. భారీ ఎత్తున ఐటీ ఉద్యోగ నియామకాలు..!

పవన్ తర్వాత....చినబాబు పెద్దగా చేసేలా ఉన్నారే..!

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఆపాలంటే.. అదొక్కటే మార్గం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>