Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sports99e32890-cfdf-40ef-81dd-cb9a5a0c6e85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sports99e32890-cfdf-40ef-81dd-cb9a5a0c6e85-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టుతో వరుసగా సిరీస్ లో ఆడుతుంది. అయితే ఇటీవలే పాకిస్తాన్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టు లోని ఆరుగురు సభ్యులు వైరస్ బారిన పడడంతో ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. కరోనా వైరస్ బారిన పడిన సభ్యులందరినీ క్వారంటైన్ లో ఉంచి కొత్త ఆటగాళ్లతో కొత్త కెప్టెన్ తో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొత్త జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుతో టి20 మ్యాచ్Sports{#}Dookudu;Babur;Pakistan;Cricket;England;Coronavirusఓకే మ్యాచ్.. రెండు జట్లు.. రెండు రికార్డులు?ఓకే మ్యాచ్.. రెండు జట్లు.. రెండు రికార్డులు?Sports{#}Dookudu;Babur;Pakistan;Cricket;England;CoronavirusSat, 17 Jul 2021 17:05:00 GMTప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇంగ్లండ్ జట్టుతో వరుసగా సిరీస్ లో ఆడుతుంది.  అయితే ఇటీవలే పాకిస్తాన్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టు లోని ఆరుగురు సభ్యులు వైరస్ బారిన పడడంతో ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది.  కరోనా వైరస్ బారిన పడిన సభ్యులందరినీ క్వారంటైన్ లో ఉంచి కొత్త ఆటగాళ్లతో కొత్త కెప్టెన్ తో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొత్త జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుతో టి20 మ్యాచ్ లో తలపడుతుంది.



 ఇక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ జట్టుకు విజయం  అందించే దిశగా ముందుకు దూసుకు పోతున్నాడు ఇక ఇటీవల జరిగిన టీ-20 మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు బాబర్ అజామ్. ఇటీవలే ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టుపై పాకిస్తాన్ జట్టు ఏకంగా 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  సాధారణంగా  మ్యాచ్ లు గెలిచిన జట్టు వివిధ రికార్డులను కొల్లగొట్టటం జరుగుతూ ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో మాత్రం అటు గెలిచిన పాకిస్థాన్ జట్టుతో పాటు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టులో కూడా అరుదైన రికార్డులు నమోదు కావడం గమనార్హం.



 ఇక ఇటీవలే 31 పరుగులతో పాకిస్తాన్ గెలుపొందిన మ్యాచ్లో బాబర్ అజమ్ 85 పరుగులు.. రిజవాన్63 పరుగులతో చెలరేగిపోయారు. దీంతో పాకిస్తాన్ 232 పరుగులు చేసింది.  అయితే ఇప్పటి వరకు టి20 చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ కూడా 232 పరుగులు చేయలేదు. టి20లో పాకిస్థాన్కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. దీంతో అరుదైన రికార్డు సాధించింది పాకిస్తాన్. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు మొదట్లో అద్భుతంగా రాణించింది. అద్భుతమైన షాట్లతో దూకుడు మీద ఆడిన లివింగ్ స్టోన్ ఏకంగా 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు. ఇప్పటివరకు ఏ ఒక ఆటగాడు కూడా 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోలేదు. ఇక అందరూ ఇంగ్లాండ్ గెలుస్తుంది అని అనుకున్నారు. అయితే కీలక సమయంలో లివింగ్ స్టోన్ అవుట్ కావడంతో చివరికి ఇక 19.2 ఓవర్లలో 201 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టు 31 పరుగులతో తేడాతో ఓటమి చవిచూసింది.



త్వ‌ర‌లో స్వ‌దేశీ యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ : అమిత్ షా

రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...?

ఫేస్బుక్ ప్రాణాలు తీస్తుంది.. జో బైడెన్ షాకింగ్ కామెంట్స్?

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

ఉప ఎన్నిక.. హుజురాబాద్ ప్రజలకు గండం కానందా?

తెలంగాణలో ఈనెల 23 నుండి థియేటర్ లు ఓపెన్.. !

నేను ఆప్షన్ గా ఉన్న అంటూ హింట్ ఇస్తున్న డీకే..?

ప్రెస్ మీట్ పెట్టిన గణేష్ ఉత్సవ కమిటీ.. ఏమన్నారంటే?

ప్రేక్షకులను థియేటర్లకు రమ్మనడం న్యాయం కాదు : సురేష్ బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>