PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth9fff3a30-3fa9-4327-9c31-eb6efd7edea4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth9fff3a30-3fa9-4327-9c31-eb6efd7edea4-415x250-IndiaHerald.jpgఒక దెబ్బకు రెండు పిట్టలు ఇదే ఇప్పుడు కొత్తగా టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వ్యూహం. కొన్నిరోజుల ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అసలు టీఆర్ఎస్‌కు బీజేపీనే అసలైన ప్రత్యర్ధి అని విశ్లేషణలు వచ్చాయి. revanth{#}politics;Diesel;Cheque;Telangana Rashtra Samithi TRS;KCR;revanth;Revanth Reddy;TPCC;Bharatiya Janata Party;Congress;Telanganaరేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా....బాగానే సెట్ చేశారు?రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా....బాగానే సెట్ చేశారు?revanth{#}politics;Diesel;Cheque;Telangana Rashtra Samithi TRS;KCR;revanth;Revanth Reddy;TPCC;Bharatiya Janata Party;Congress;TelanganaSat, 17 Jul 2021 00:00:00 GMTఒక దెబ్బకు రెండు పిట్టలు ఇదే ఇప్పుడు కొత్తగా టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వ్యూహం. కొన్నిరోజుల ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అసలు టీఆర్ఎస్‌కు బీజేపీనే అసలైన ప్రత్యర్ధి అని విశ్లేషణలు వచ్చాయి.

కానీ ఊహించని విధంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు దక్కాయి. దీంతో రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సైతం కూడా రేసులోకి వచ్చింది. బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ కొత్త ఊపు తీసుకొచ్చారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పీసీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.

మొదట తన పార్టీని లైన్‌లో పెట్టేసుకుని, అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. అలాగే ఇప్పుడుప్పుడే ఎదుగుతున్న బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీలని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై పోరాటం మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఈ అంశంపై ఆందోళనలు చేస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక దీనికి కారణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే కారణమనే సంగతి తెలిసిందే.

అందుకే కేంద్రంలో అధికారంలో బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ పోరాటం మొదలుపెట్టారు. ఇలా రెండు పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ అంశంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంలో రేవంత్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఈ అంశంపై పోరాటం చేయలేదు. అందుకే రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని తనకు ఆయుధంగా మార్చుకుని, బీజేపీ, టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి చూస్తున్నారు.  



తెలుగు రాష్ట్రాల‌పై మోడీ న‌యా టార్గెట్ ఇదే..!

ఆ సీనియ‌ర్ ఆ ఎమ్మెల్యే అసంతృప్తి జ‌గ‌న్ చ‌ల్లార్చేనా..?

జలవివాదంపై షర్మిల స్టాండ్ ఎలా ఉంది.. ఎలా ఉండాలి..?

T-20 వరల్డ్ కప్: దాయాదుల మధ్య పోరు : బిజెపి ఎంపి షాకింగ్ కామెంట్స్?

పీకే పవర్ పాలిటిక్స్ .. రాహుల్ ప్రధానవ్వడం ఖాయమేనా?

శుక్రవారం పెట్రో ధరలపై చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. దాని కొనసాగింపుగా ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై ఓ బాంబు పేల్చబోతున్నారు. గురు, శుక్రవారాల్లో జరిగిన కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంలో జరిగిన కుంభ కోణాన్ని బయటపెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు.

కోకాపేట వేలం: కేసీఆర్ పై ''లాండ్‌'' మైన్‌ పేల్చనున్న రేవంత్‌..?

కర్ణాట‌క సీఎం మార‌నున్నాడా..? ఢిల్లీకి `య‌డ్డి` ప‌య‌నంపై ప‌లు అనుమానాలు!

అలర్ట్ : వరుసగా కామన్ ఎంట్రన్స్ పరీక్షలు.. తేదీలు ఇవే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>