PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/babori-revanth2af91f37-43fd-461e-95f7-be6d7c793341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/babori-revanth2af91f37-43fd-461e-95f7-be6d7c793341-415x250-IndiaHerald.jpgటీపీసీసీ అథ్యక్ష పదవి దక్కిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పార్టీలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్లు కూడా ప్రస్తుతం రేవంత్ దూకుడు చూసి బాబోయ్ అంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అసలు రేంవత్ కు పీసీసీ పదవి దక్కడం పైనే ఆశ్చర్యంగా ఉన్న కొంతమంది పెద్దలు... ఇప్పుడు వ్యవహార శైలి చూసి అవాక్కవుతున్నారు. Revanth{#}Adilabad;Dhoom;Huzurabad;revanth;Congress;raj;Revanth Reddy;TPCC;Hyderabad;Telangana;Partyరేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారురేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారుRevanth{#}Adilabad;Dhoom;Huzurabad;revanth;Congress;raj;Revanth Reddy;TPCC;Hyderabad;Telangana;PartyFri, 16 Jul 2021 18:54:00 GMTటీపీసీసీ అథ్యక్ష పదవి దక్కిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పార్టీలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్లు కూడా ప్రస్తుతం రేవంత్ దూకుడు చూసి బాబోయ్ అంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అసలు రేంవత్ కు పీసీసీ పదవి దక్కడం పైనే ఆశ్చర్యంగా ఉన్న కొంతమంది పెద్దలు... ఇప్పుడు వ్యవహార శైలి చూసి అవాక్కవుతున్నారు.

దాదాపు మూడు నెలల పాటు సాగిన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక చివరికి రేవంత్ ఎంపికతో ఒక కొలిక్కి వచ్చింది. అసలు చివరి వరరు రేస్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని రేవంత్ కు రావడం... పార్టీలో కొంత మంది సీనియర్లకు అసలు నచ్చడం లేదు. ఇదే సమయంలో రేవంత్ లాబీయింగ్ చేసి... తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంఛార్జ మాణిక్కం ఠాగూర్ కు రూ.50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ పదవి దక్కించుకున్నాడనే ఆరోపణలు కూడా బహిరంగంగానే చేశారు. కానీ రేవంత్ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తన పేరు ప్రకటించిన వెంటనే పార్టీ సీనియర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు.

పీసీసీ పదవి స్వీకరణ కార్యక్రమాన్ని కూడా ధూమ్ ధామ్ గా నిర్వహించాడు. అంతటితో ఆగకుండా హుజురాబాద్ ఎన్నికలే టార్గెట్ గా తొలి పర్యటనను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించాడు. కోవర్టులు ఖబద్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశాడు. చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాలకు విభిన్నంగా అన్నీ తానే అయి ముందుండి నడిపించాడు,. శ్రేణులను పరుగులెత్తించి కొత్త ఉత్సాహం తెప్పించాడు.  అసలు రేవంత్ దూకుడు చూస్తున్న సీనియర్లు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక.... భవిష్యత్తులో తమ స్థానాలు ఉంటాయో ఉండవో కూడా తెలియక బుర్ర గొక్కుంటున్నారు.



గోవిందుడు అందరివాడేలా.. ఆయన కాదంటే చరణ్ దగ్గరకు వచ్చిందా..!

బయట డ్యాన్స్‌... ఇంట వ్యాక్సిన్‌...

కోకాపేటలో చేతులు మారిన రూ.వెయ్యి కోట్లు

గెజిట్ నోటిఫికేషన్ పై కేంద్రం క్లారిటీ

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?

ఏపీలో ఉద్యోగాలివ్వ‌నున్న జ‌న‌సేన‌?

తెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>