MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya41988c53-a166-4634-82b8-bb1a23d23df0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya41988c53-a166-4634-82b8-bb1a23d23df0-415x250-IndiaHerald.jpgబాలయ్య టాలీవుడ్ ని ఏలుతున్న రోజులు అవి. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్న కాలమది. అపుడే వరస హిట్లతో జోరు మీద ఉన్న ఈవీవీ సత్యనారాయణ కూడా బాలయ్యతో సినిమా చేయాలని చూస్తున్నారు. balayya{#}Heroబాలయ్య ఈవీవీ ఫస్ట్ కాంబో ఎందుకు ఆగింది... ?బాలయ్య ఈవీవీ ఫస్ట్ కాంబో ఎందుకు ఆగింది... ?balayya{#}HeroFri, 16 Jul 2021 20:00:00 GMTబాలయ్య టాలీవుడ్ ని ఏలుతున్న రోజులు అవి. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్న కాలమది. అపుడే వరస హిట్లతో జోరు మీద ఉన్న ఈవీవీ సత్యనారాయణ కూడా బాలయ్యతో సినిమా చేయాలని చూస్తున్నారు.

ఇక ఈవీవీ కామెడీకి పెట్టింది పేరు. అంతే కాదు, హీరో వాల్యూని అలా ఉంచుతూనే కామెడీ టచ్ తో అధ్బుతమైన హిట్లు కొట్టారు. అలా నాగార్జునతో ఆయన తీసిన హలో బ్రదర్ అప్పట్లోనే  ఒక ఊపు ఊపేసింది. ఈ నేపధ్యంలో బాలయ్యతో ఈవీవీ కాంబో సెట్ అయితే బాగుంటుంది అని నందమూరి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్న నేపధ్యం ఉంది. ఇక ఇలాంటి కాంబోను సెట్ చేయడంతో దిట్ట. బాలయ్య ఫ్యాన్స్ మెచ్చిన నిర్మాత అయిన ఎస్ గోపాల్ రెడ్డి ఉండనే ఉన్నారు. ఆయన భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా బాలయ్య ఈవీవీ ఫస్ట్ కాంబో అంటూ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు.

ఎంతో ఆడంబరంగా షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమాకు మాతో పెట్టుకోకు అంటూ ఇంటెరెస్టింగ్ టైటిల్ ని ఈవీవీ పెట్టారు. ఇక హ‌లో బ్రదర్ లాగానే ఇందులో కూడా హీరో రెండు పాత్రలలో కనిపిస్తారు. సినిమా ఓపెనింగ్ తరువాత విపరీత‌మైన హైప్ కూడా వచ్చింది. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్న టాక్ కూడా వచ్చేసింది. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఈవీవీ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. బాలయ్యకు ఇష్టుడైన ఎ కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా  వచ్చి చేరారు.

అంతే కాదు కధ కూడా ఈవీవీ అనుకున్నది కాదని చెబుతారు.  వేరే తమిళ్ మూవీ రీమేక్ తో  ఈ సినిమా తీశారు. ఈ సినిమా 1995లో రిలీజ్ అయింది డిజాస్టర్ కూడా అయింది. ఆ విధంగా బాలయ్య ఖాతాలో పడాల్సిన ఒక సూపర్ హిట్ పోయింది. ఇది జరిగిన కొన్నేళ్ళకు బాలయ్య ఈవీవీ కాంబో మళ్ళీ సెట్ అయింది. ఈసారి నిర్మాత ఎవరో కాదు, బాలయ్యే. ఆయన సొంత నిర్మాణ సంస్థ రామక్రిష్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీసిన గొప్పింటి అల్లుడు ఆశించినంత విజయం సాధించలేదు కానీ బాలయ్యలోని కామెడీ కోణాన్ని మాత్రం ఈవీవీ సూపర్ గా ఎలివేట్ చేశారు.






ప్రభాస్ తల్లి గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

'రికార్డులు కాదు,టాక్స్ కట్టడం ముఖ్యం బిగిలు'.. విజయ్ పై ట్రోల్స్..

బాలయ్య టాలీవుడ్ ని ఏలుతున్న రోజులు అవి. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్న కాలమది. అపుడే వరస హిట్లతో జోరు మీద ఉన్న ఈవీవీ సత్యనారాయణ కూడా బాలయ్యతో సినిమా చేయాలని చూస్తున్నారు.

గోవిందుడు అందరివాడేలా.. ఆయన కాదంటే చరణ్ దగ్గరకు వచ్చిందా..!

లక్కీగా ఫీల్ అవుతున్న ఫాహద్‌ ఫాజిల్‌.. ఎందుకంటే..!?

సీనియర్ సిటిజన్స్ అయిన కూడా టాలీవుడ్ ని ఏలుతున్న హీరోలు

ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క.. కారణం అదేనా.. ?

లుక్ తో టాలీవుడ్ నే మెప్పించాడు.. బాలీవుడ్ కూడా ఫిదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>