MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpgనిన్న విడుదల అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ‘రోర్ ఆఫ్ RRR’ అనే పేరుతో విడుదలచేసిన మేకింగ్ వీడియోకి ఊహించినట్లుగానే విపరీతమైన స్పందన వచ్చింది. వెండితెర అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి రాజమౌళి టీమ్ ఏవిధంగా కృషి చేస్తోంది అన్న విషయాన్ని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. అయితే ఈ వీడియో కేవలం మేకింగ్ వీడియోలా కాకుండా స్పెషల్ ట్రైలర్ లా కట్ చేయడంతో ఈ వీడియోకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈవీడియో ద్వారా ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మరోసారిrajamouli rrr{#}Rajamouli;Dussehra;Vijayadashami;Europe countries;Dubai;October;Cinemaఆర్ ఆర్ ఆర్ హడావిడిలోని మర్మం !ఆర్ ఆర్ ఆర్ హడావిడిలోని మర్మం !rajamouli rrr{#}Rajamouli;Dussehra;Vijayadashami;Europe countries;Dubai;October;CinemaFri, 16 Jul 2021 09:00:00 GMTనిన్న విడుదల అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ‘రోర్ ఆఫ్ RRR’ అనే పేరుతో విడుదలచేసిన మేకింగ్ వీడియోకి ఊహించినట్లుగానే విపరీతమైన స్పందన వచ్చింది. వెండితెర అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి  రాజమౌళి  టీమ్  ఏవిధంగా కృషి చేస్తోంది అన్న విషయాన్ని  ఈ మేకింగ్ వీడియోలో చూపించారు.  


అయితే ఈ వీడియో కేవలం మేకింగ్ వీడియోలా కాకుండా స్పెషల్ ట్రైలర్  లా కట్ చేయడంతో  ఈ వీడియోకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  ఈవీడియో ద్వారా ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మరోసారి స్పష్టం చేయడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు  తెర పడింది. ఇది అంతా ఒక వైపు కనిపించే పరిస్థితి.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు ప్రకారం ఈ సినిమాకు రకరకాలుగా  బయ్యర్లు ఉన్నారని వాటిలో పెన్ స్టూడియోస్ ఒకటి అని తెలుస్తోంది. ఆ సంస్థ సుమారు 100 కోట్లు ‘ఆర్ ఆర్ ఆర్’ కు అడ్వాన్స్ గా ఇచ్చిందని లీకులు వస్తున్నాయి. ఆ సంస్థకు  ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణ సంస్థతో ఉన్న ఎగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ 13న విడుదల కావలసి ఉంది.


అందుకే ఆ డేట్ ను పదేపదే ప్రకటిస్తున్నారని  కానీ ఈ లోగా ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యుఎస్, ఆస్ట్రేలియా, యుకె, దుబాయ్ అలాగే ఇండియాలో మహారాష్ట్రలో మళ్ళీ పెరిగి పోతున్న కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా సమస్య ఏర్పడితే అది సాకుగా చూపించి , మల్లి యార్ యార్ యార్ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యూరప్ లో  ఈ సినిమా షూట్  పూర్తి కావలసి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీని చివరి వరకు నమ్మలేమని దీనివల్ల  దసరా రేస్ మరింత కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది  అంటున్నారు..





భార్యతో నాని లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా ?

టాలీవుడ్ లోకి మన హీరోలు ఏ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారో తెలుసా..?

" మా" ఎన్నికలు : మంచు విష్ణు కు నాగబాబు కౌంటర్ ?

దుబాయ్‌ లాటరీలో భారతీయుడికి రూ. 7.45 కోట్లు..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>