CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/katugadu-b2159e3c-f053-4de6-b020-bf8f3458711e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/katugadu-b2159e3c-f053-4de6-b020-bf8f3458711e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాను వాడటం మంచి టైంపాస్. బోర్ కొడితే ఇన్ స్టాగ్రామ్ అలా ఓపెన్ చేశామంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కానీ సామాజిక మాధ్యమాల వాడకం అనేది కత్తిమీద సాము లాంటిది. మనకు వాడటం రాకుంటే అమాయకుల్ని చేసి కేటుగాళ్లు ఆడుకుంటారు. Katugadu {#}Priya;Sanjeev;chatting;Parents;ram pothineni;Guntur;policeఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వల వేసిన కేటుగాడు..చివరికి..!?ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వల వేసిన కేటుగాడు..చివరికి..!?Katugadu {#}Priya;Sanjeev;chatting;Parents;ram pothineni;Guntur;policeFri, 16 Jul 2021 19:10:39 GMTసోషల్ మీడియాను వాడటం మంచి టైంపాస్. బోర్ కొడితే ఇన్ స్టాగ్రామ్ అలా ఓపెన్ చేశామంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కానీ సామాజిక మాధ్యమాల వాడకం అనేది కత్తిమీద సాము లాంటిది. మనకు వాడటం రాకుంటే అమాయకుల్ని చేసి కేటుగాళ్లు ఆడుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా అని వ్యక్తిగత వివరాలు చెప్పామంటే బోల్తాపడినట్లే. ఫేక్ ఎకౌంట్స్ తో అమ్మయిలను వేధిస్తారు. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. అసలు జరిగిందేంటంటే..!

గుంటూరు నగరంలోని సంజీవ్ నగర్ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కుమారుడు పూనూరి రామ్ ప్రకాష్ చెడు అలావాట్లకు బానిసై తప్పుదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ప్రియా అనే పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి తన కేలేజీలో విద్యార్థినీలకు, మహిళలకు ఫ్రెండ్ రిక్వస్ట్ పంపేవాడు. వారితో  చాటింగ్ చేస్తూ దగ్గరయ్యేవాడు. మాటల్లో మాటగా..రామ్ మంచివాడని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాడు. ఆ తరువాత తన సొంత ఎకౌంట్ నుంచి అదే అమ్మాయిలకు రిక్వస్ట్ పంపేవాడు. ముందే ప్రియ చెప్పటంతో  వారంతా రామ్ రిక్వస్ట్ ని అంగీకరించేవారు.

ఇంకేముంది వారితో చాటింగ్ చేస్తూ దగ్గరయ్యేవాడు. పర్సనల్ విషయాలపై కూడా చాటింగ్ చేస్తూ వారి సీక్రెట్స్ అన్ని తెలుసుకునేవాడు. ఆ తరువాత అత్యవసరం అని ఆ యువతుల దగ్గరనుంచి డబ్బులు తీసుకనేవాడు.  ఇదే క్రమంలో గుంటూరు శ్రీనివసరావుపేటకు చెందిన యువతిని వలలో వేసుకుని 85వేలు తీసుకున్నాడు.

ఆ తరువాత ఆమెను బెదిరించి ఇన్ స్టా ఐడీ, పాస్ వర్డ్ తీసుకుని ఆ అకౌంట్ లో ఉన్న అమ్మాయిలతో చాటింగ్ చేశాడు. దీంతో ఆమె ఆ అకౌంట్ ను బ్లాక్ చేసింది. అయినా వేధింపులు మానుకోని రామ్ ఫోన్లు చేసి బెదిరించేవాడు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరంచేవాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. విషయం తెలిసి కంగుతిన్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దాదాపు 350మందికి ఫేక్ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వస్టులు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది.



బుడుగు: ఏడాది వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వండి..!?

సజ్జల తీరుపై మంత్రుల గుర్రు!

మూడేళ్లుగా అత్యాచారం.. ప్రభాస్ ప్రొడ్యూసర్ పై కేసు.. !

బాలుడిపై మోజు.. భర్తను అమాయకున్ని చేసి?

దేశంలో 30 లక్షల మంది చిన్నారులకు అందని ఈ టీకా..?

నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?

క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

చీప్ వ్యక్తులే ఇలా చేస్తారు... నిధి సీరియస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>