MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sameera-reddy-weight-loss-journey-video-viral3819cbde-28f6-4995-85f8-3ea8d31ecf5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sameera-reddy-weight-loss-journey-video-viral3819cbde-28f6-4995-85f8-3ea8d31ecf5f-415x250-IndiaHerald.jpgనరసింహుడు, అశోక్ వంటి చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించిన సమీరారెడ్డి 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలోని ఒక పాటలో కనిపించారు. ఇక ఆ తర్వాత ఆమె టాలీవుడ్ పరిశ్రమకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆమె 2014వ సంవత్సరంలో అక్షయ్‌ వర్దే అనే ఒక పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. వివాహజీవితంతో బాగా బిజీ అయిపోయిన సమీరారెడ్డి సినిమాల్లో నటించడం కూడా మానేశారు. సమీరా రెడ్డి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సమీరా రెడ్డి కి ప్రస్తుతం 42 ఏళ్లు కానీ ఆమె చూసేందుకు మాత్రం 30 ఏళ్లSameera Reddy {#}Diwali;ashok;Reddy;Jr NTR;Tollywood;marriageబరువు తగ్గడానికి తారక్ హీరోయిన్ ఏం చేశారో చూడండి..!బరువు తగ్గడానికి తారక్ హీరోయిన్ ఏం చేశారో చూడండి..!Sameera Reddy {#}Diwali;ashok;Reddy;Jr NTR;Tollywood;marriageFri, 16 Jul 2021 15:00:00 GMTనరసింహుడు, అశోక్ వంటి చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించిన సమీరారెడ్డి 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురం సినిమాలోని ఒక పాటలో కనిపించారు. ఇక ఆ తర్వాత ఆమె టాలీవుడ్ పరిశ్రమకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆమె 2014వ సంవత్సరంలో అక్షయ్‌ వర్దే అనే ఒక పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. వివాహజీవితంతో బాగా బిజీ అయిపోయిన సమీరారెడ్డి సినిమాల్లో నటించడం కూడా మానేశారు. సమీరా రెడ్డి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

సమీరా రెడ్డి కి ప్రస్తుతం 42 ఏళ్లు కానీ ఆమె చూసేందుకు మాత్రం 30 ఏళ్ల యువతిలా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆమె చాలా కాలంగా క్రమం తప్పకుండా కఠినమైన వ్యాయామాలు చేయడమేనని చెప్పుకోవచ్చు. పెళ్లయిన తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొంచెం లావెక్కారు. సాధారణంగా పిల్లలు బలంగా, పుష్టిగా పెరగాలని గర్భం ధరించిన సమయంలో ప్రతి మహిళ ఎక్కువగా పోషకాహారం పుచ్చుకుంటారు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా పాల ఉత్పత్తి కోసం సాధారణ రోజుల్లో కంటే కొంచం ఎక్కువగానే తింటారు. దీనివల్ల వారు బరువు పెరుగుతారు. ఈ సమయంలో మహిళలకు హార్మోన్ల అసమతుల్యత సమస్యలు కూడా తలెత్తుతాయి. వెరసి వారు లావెక్కుతారు. మహిళలు టీనేజ్ తర్వాత, పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత బరువు పెరిగితే.. సన్నగా అవ్వడం దాదాపు అసాధ్యం. మంచి డైట్ ఫాలో అవుతూ కఠినమైన వ్యాయామాలు చేస్తేనే బరువు తగ్గడం జరుగుతుంది.

అయితే సెలబ్రెటీలు కూడా పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు. సమీరా రెడ్డి కూడా వివాహానంతరం బాగా లావెక్కారు. కానీ ఆమె ఏ మాత్రం బాధ పడకుండా మళ్లీ సన్నగా అవ్వాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె తన ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రతి రోజు రన్నింగ్, స్కిప్పింగ్ చేస్తూ చాలా వరకు బరువు తగ్గారు. అయితే ఆమె తన వెయిట్‌లాస్ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన అభిమానుల్లో ఫిట్‌నెస్‌ గోల్స్ పెంచుతున్నారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక ఫిట్‌నెస్‌ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె బరువు ఎలా తగ్గారో చెప్పుకొచ్చారు. స్కిప్పింగ్, రన్నింగ్ చేయడం ద్వారా తను బరువు తగ్గాలని ఆమె వెల్లడించారు. ఫిట్‌నెస్‌ ఫ్రైడే పేరిట ఒక వీడియో పోస్ట్ చేసిన ఆమె వచ్చే దీపావళి పండుగ నాటికి మరింత బరువు తగ్గుతానని వెల్లడించారు.



దేవయాని రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదేనా..?

బరువు తగ్గడానికి తారక్ హీరోయిన్ ఏం చేశారో చూడండి..!

బాబుని ముఖ్య‌మంత్రి చేయ‌డానికి ఎవ‌రైనా ఎదిరిస్తా...!

బాలుడిపై మోజు.. భర్తను అమాయకున్ని చేసి?

నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?

లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

జక్కన్న చేతుల మీదుగా హిందీ చత్రపతి లాంచ్.. !

నాగార్జున మొద‌టి భార్య‌కు ఆ కార‌ణంతోనే విడాకులు ఇచ్చాడా ?

క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>