PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/rammohan-naidue4d0beb7-acb4-4644-87ad-abfd8d502b5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/rammohan-naidue4d0beb7-acb4-4644-87ad-abfd8d502b5d-415x250-IndiaHerald.jpgటీడీపీకి కంచుకోటగా చెప్పుకొనే జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. సిక్కోలులో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. నేతల గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ కేడర్ పార్టీకి అండగా ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. జగన్ వేవ్‌లో కీలక నేతలంతా ఓటమి పాలైనా, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన నాయుడు, Rammohan Naidu{#}Jagan;Ram Mohan Naidu Kinjarapu;Hanu Raghavapudi;MP;District;Srikakulam;Assembly;Diesel;Minister;TDP;YCP;Ichchapuram;Party;Coronavirusశ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?శ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?Rammohan Naidu{#}Jagan;Ram Mohan Naidu Kinjarapu;Hanu Raghavapudi;MP;District;Srikakulam;Assembly;Diesel;Minister;TDP;YCP;Ichchapuram;Party;CoronavirusFri, 16 Jul 2021 06:27:52 GMTటీడీపీకి కంచుకోటగా చెప్పుకొనే జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. సిక్కోలులో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. నేతల గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ కేడర్ పార్టీకి అండగా ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. జగన్ వేవ్‌లో కీలక నేతలంతా ఓటమి పాలైనా, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన నాయుడు, టెక్కలి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు గెలుపొందారు. మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో రెండు మాత్రమే గెలుచుకుంది టీడీపీ. ఇక ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు సైతం ఆరువేల మెజారిటీ మాత్రమే సాధించారు. తన గెలుపుపై పోస్ట్‌మార్టం నిర్వహించుకున్నారో ఏమో గానీ దూరమైన సామాజికవర్గాలకు ఎలాగైనా దగ్గరవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలైన మత్స్యకారులు టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. అనేక ప్రాంతాల్లో మత్స్యకార ఓట్లే కీలకం. జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో సుమారు లక్షా ముప్పై వేలకు పైగా మత్స్యకారులున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం మత్స్యకార వర్గం వైసీపీ వెంట నడించింది. దానికి కారణం కూడా ఉందంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు తమని ఎస్టీల్లో కలపాలంటూ భారీ ఉద్యమమే చేశారు. కానీ, టీడీపీ నుంచి అంత మద్దతు దక్కలేదు. అదే సమయంలో తమకు మద్దతు పలికితే మంత్రి పదవిని సైతం మత్స్యకార వర్గానికి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. దీంతో వారంతా టీడీపీకి దూరమయ్యారు.

ఆ సమయంలో పార్టీకి దూరమైన ఆ వర్గాన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు రామ్మోహననాయుడు. కొంతకాలంగా ఆయన మత్స్యకారుల సమస్యలపై గళమెత్తుతున్నారు. డీజిల్ సబ్సిడీలో గోల్‌మాల్ జరిగిందని, మత్స్యకార భరోసా పథకంలో జిల్లా మత్స్యకారులకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉన్నతాధికారులుకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లాలో సముద్ర జలాలపై షిప్పులో పని చేసే 5వేల మందికి పైగా సీమెన్ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ కలెక్టర్‌తో మాట్లాడి ఆ దిశగా సక్సెస్‌ అయ్యారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. దీంతో ఆ వర్గానికి కొంత వరకు దగ్గరయ్యారని అంటున్నారు. మొత్తానికి పోగొట్టుకున్న చోటే ఎంపీ వెతుక్కుంటున్నారని, మత్స్యకార సమస్యలపై పోరాడుతూ వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది.



హుజురాబాద్‌ అభ్యర్థులు ఎవరో..?

దెందులూరులో హాట్‌హాట్ పాలిటిక్స్

జగన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స్పీకర్.. తలపోటు తప్పేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అచ్చెన్నకు చెక్ పెట్టేసినట్లేనా?

రేవంత్‌ని లైట్ తీసుకుంటే చిక్కులే...!

యూవిసి టెక్నాలజీతో కరోనా పరార్..

జగనన్న కొత్త స్కీమ్..అందరికీ!

చినబాబు సీరియస్‌గా ఉన్నారు...కలిసొస్తుందా!

ఆ విషయంలో వైసీపీపై టీడీపీదే పైచేయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>