PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-78fbb3f2-1df1-49f8-970d-b12cd6301be0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-78fbb3f2-1df1-49f8-970d-b12cd6301be0-415x250-IndiaHerald.jpgఅయితే మరికొందరు మాత్రం మంత్రి సొంత పనులు పూర్తి చేయించుకునేందుకు భేటీ అయినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్ కూడా సెలవుపై విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం ఉండడంతో ఈ సమయంలోనే తమ పనులు పూర్తి చేసుకునేందుకు మంత్రి మల్లారెడ్డి రహస్య భేటీ అయినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే గాని తెలియదని ప్రజలు అంటున్నారు.Political {#}Medchal;collector;thursday;News;pragathi;House;Ministerఆ మంత్రి ఆ కలెక్టర్ రహస్య బేటి దేనికో మరీ..?ఆ మంత్రి ఆ కలెక్టర్ రహస్య బేటి దేనికో మరీ..?Political {#}Medchal;collector;thursday;News;pragathi;House;MinisterFri, 16 Jul 2021 11:05:00 GMTరాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తో  గురువారం జరిగిన రహస్య భేటీ  రాష్ట్రంలో  చర్చనీయాంశమైంది. స్వయంగా మంత్రి  కలెక్టర్ ను కలిసి మాట్లాడితే సమాచార శాఖ గాని, కలెక్టర్ కార్యాలయం గాని  ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. పైగా మంత్రి  కలెక్టర్ తో భేటీ కావడం పర్సనల్ పోగ్రామ్ గా చెప్పడం పట్ల  పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో  మంత్రి యొక్క సొంత పనులు చక్క బెట్టుకునేందుకే కలెక్టర్ గారితో సమావేశం అయ్యారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 మరికొందరు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు సంబంధించిన  సమావేశం అయి ఉంటుందని  చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే  మంత్రి కలెక్టర్ అధికారిక అంశాలు చర్చిస్తే బయటకు చెప్పేందుకు అభ్యంతరం ఏమీ ఉంటుందని అంటున్నారు. విషయాలు బయటకు వెల్లడించలేదు అంటే మంత్రి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ చాంబర్లో మంత్రి మల్లారెడ్డి భేటీ కావడం పట్ల  రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు జనాలు. ఈ మధ్య జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న చాలా కార్యక్రమాలు కలెక్టర్ పాల్గొనక పోవడం కొంత చర్చకు దారితీసింది. అధికారిక కార్య క్రమాలకు కూడా ఇద్దరు వేర్వేరుగా చేపట్టడం, ఈ పరిణామాలను చూస్తే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే మరికొందరు మాత్రం మంత్రి సొంత పనులు పూర్తి చేయించుకునేందుకు  భేటీ అయినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్ కూడా సెలవుపై  విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం ఉండడంతో ఈ సమయంలోనే తమ పనులు పూర్తి చేసుకునేందుకు మంత్రి మల్లారెడ్డి రహస్య భేటీ  అయినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే గాని తెలియదని ప్రజలు అంటున్నారు.



నీ భర్త ఎవరని అడుగుతున్నారు... నటి ఎమోషనల్.. !

కాజల్ తీరు పై సెటైర్లు !

అల్లుఅర్హ చుట్టూ బాడీగార్డ్స్.. షాక్ అవుతున్న సినీబృందం..?

ఆ ఊర్లో స‌మాదులే సిగ్న‌ల్ స్పాట్ లు.. !

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

బ‌క్రీద్ సంద‌ర్భంగా ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి : మంత్రి

ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్

ఎఫ్ త్రీ కి అతడే హైలెట్ అట..!

చైతూ, సమంతల లవ్ పై నాగార్జున సీక్రెట్ ఏజెంట్స్ వీరే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>