MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sammathame-52bb1a63-341e-4cb0-995c-868d5d954e3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sammathame-52bb1a63-341e-4cb0-995c-868d5d954e3f-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. ఇక చిన్న సినిమాతో సినీ జీవితం ప్రారంభించి.. వరుస అవకాశాలను అందుకోవడం ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. హీరోగా రాణించడం మరో ఎత్తు ఎత్తు అనే చెప్పాలి. sammathame {#}Nani;Chandni;kiran;prema;priyanka jawalkar;sekhar chandra;sridhar;vijay deverakonda;Posters;Reddy;Hero;Love;Telugu;Cinemaసమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?sammathame {#}Nani;Chandni;kiran;prema;priyanka jawalkar;sekhar chandra;sridhar;vijay deverakonda;Posters;Reddy;Hero;Love;Telugu;CinemaFri, 16 Jul 2021 08:06:25 GMTచిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. ఇక చిన్న సినిమాతో సినీ జీవితం ప్రారంభించి.. వరుస అవకాశాలను అందుకోవడం ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ.. హీరోగా రాణించడం మరో ఎత్తు ఎత్తు అనే చెప్పాలి.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరోలు కూడా ఉన్నారు. ఇక  అందులో న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. అంతేకాక..  స్టార్ డమ్ సంపాదించుకోవడంలో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజగా మరో యాంగ్ హీరో కూడా అదే కోవలోకి వస్తున్నారు. ఆయనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

కిరణ్ అబ్బవరం రాజవారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశారు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటించారు. ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించారు. అంతేకాదు.. ఈ మూవీని ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. ఇక అటు ఈ మూవీ చేస్తూనే.. మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు కిరణ్ అబ్బవరం.

అయితే తాజాగా కిరణ్ నటిస్తున్న సమ్మతమే సినిమా ఫస్ట్‏లుక్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి కి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరీ హీరోయిన్‏గా నటిస్తుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెలుస్తుంది. ఇక ఇందులో కిరణ్ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కనిపిస్తుండగా.. అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తుంది. ఈ సినిమాని ప్రవీణ నిర్మిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.



కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

స్వీటీకి బ్యాడ్ టైమ్..!

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>