PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/big-shock-for-kcr1aaa482e-6a99-44fd-beba-582ed7d75652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/big-shock-for-kcr1aaa482e-6a99-44fd-beba-582ed7d75652-415x250-IndiaHerald.jpgఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చింది. రెండు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్ట్ లపై పెత్తనం బోర్డులదేనని తేల్చి చెప్పింది. అంటే ఇకపై రెండు రాష్ట్రాల్లో ఎవరికి వారే విడివిడిగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లతోపాటు, ఉమ్మడి ప్రాజెక్ట్ లైన శ్రీశైలం, నాగార్జున సాగర్ పై కూడా పెత్తనం బోర్డులకే దఖలు పడుతుంది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 14నుంచి ఇది అమలులోకి వస్తుంది. big shock for kcr{#}KCR;Akkineni Nagarjuna;Krishna River;Andhra Pradesh;Telangana;Telugu;Rayalaseema;October;Aqua;central governmentకేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..big shock for kcr{#}KCR;Akkineni Nagarjuna;Krishna River;Andhra Pradesh;Telangana;Telugu;Rayalaseema;October;Aqua;central governmentFri, 16 Jul 2021 07:00:00 GMTఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చింది. రెండు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్ట్ లపై పెత్తనం బోర్డులదేనని తేల్చి చెప్పింది. అంటే ఇకపై రెండు రాష్ట్రాల్లో ఎవరికి వారే విడివిడిగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లతోపాటు, ఉమ్మడి ప్రాజెక్ట్ లైన శ్రీశైలం, నాగార్జున సాగర్ పై కూడా పెత్తనం బోర్డులకే దఖలు పడుతుంది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 14నుంచి ఇది అమలులోకి వస్తుంది.

కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలు ఏపీకి అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ వాదనకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకం వ్యవహారంలో మొదలైన గొడవ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కేంద్రబిందువైంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నీటిని విడుదల చేసింది. దీనిపై పలుమార్లు బోర్డులకు, కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి ప్రాజెక్ట్ లపై కేంద్రం పెత్తనం కోరింది. నిర్వహణ, భద్రత అన్నీ కేంద్రం చెప్పుచేతల్లోకి తీసుకోవాలని సూచించింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించినా.. సమస్య పరిష్కారం కోసం ఏపీ ఇదే ప్రత్యామ్నాయాన్ని కోరింది.

ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ చూపించిన ప్రత్యామ్నాయ మార్గంలో కూడా దాదాపుగా ఏపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిపి బోర్డ్ లకు 400కోట్ల రూపాయల సీడ్ మనీ డిపాజిట్ చేయాలని, ఆ తర్వాత నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15రోజుల్లోగా అందజేయాలని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. అనుమతిలేని ప్రాజెక్ట్ లపై 6నెలల్లోగా బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ బోర్డు అనుమతి లేకపోతే, ప్రాజెక్ట్ లు పూర్తయినా వాటిని వినియోగించడానికి వీల్లేదు. ఇలా కృష్ణానదిపై ఉన్న 36 ప్రాజెక్ట్ లు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్ట్ లను రెండు బోర్డుల పరిధిలోకి చేర్చింది. ఇక కీలకంగా ఉన్న నీటి వాటాపై ట్రిబ్యునల్ కేటాయింపులే ఫైనల్ అని, దీనిపై కృష్ణా ట్రిబ్యునల్ -2 నివేదిక వచ్చే వరకు పాత లెక్కలే అమలులో ఉంటాయని తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్ చేస్తున్న ఫిఫ్టీ ఫిఫ్టీ వాదన కూడా వీగిపోయినట్టే.

కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనను తెలంగాణ ఒప్పుకుంటుందా లేదా అనేది అనుమానమే. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లను పూర్తిగా బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం వెలువరించిన నిబంధనలు ఏపీకి మాత్రం ఊరటనిస్తున్నాయి.



కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

ఈటల స్థానంలో మంత్రి వర్గంలోకి వచ్చేది ఈయనే ?

ఇవాళ ఖానామెట్‌లో భూముల వేలం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>