PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/inteligence66d4d71d-4ad5-4625-ba50-022bdd799120-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/inteligence66d4d71d-4ad5-4625-ba50-022bdd799120-415x250-IndiaHerald.jpgఇంటెలిజెన్స్ వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థపై వచ్చినన్ని ఆరోపణలు మరెప్పుడు రాలేదు. ఐబీగా వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసిందదనేది ప్రధాన ఆరోపణ. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్... సొంత పార్టీ నేతల గురించి వాకబు చేయడం... అసలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశమే ప్రధానంగా జరిగేది. మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా చంద్రబాబు చెInteligence{#}Anti-Corruption Bureau;Smart phone;Telangana;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Revanth Reddy;KCR;Telugu;Telugu Desam Party;TPCC;YCP;Andhra Pradesh;CBN;Partyవివాదాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరోవివాదాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరోInteligence{#}Anti-Corruption Bureau;Smart phone;Telangana;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Revanth Reddy;KCR;Telugu;Telugu Desam Party;TPCC;YCP;Andhra Pradesh;CBN;PartyFri, 16 Jul 2021 16:45:54 GMTఇంటెలిజెన్స్ వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్  బ్యూరో వ్యవస్థపై వచ్చినన్ని ఆరోపణలు మరెప్పుడు రాలేదు. ఐబీగా వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసిందదనేది ప్రధాన ఆరోపణ. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్... సొంత పార్టీ నేతల గురించి వాకబు చేయడం... అసలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశమే ప్రధానంగా జరిగేది. మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా చంద్రబాబు చెప్పు చేతల్లో ఉందనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా వేటుపడింది కూడా ఐబీ వెంకటేశ్వరరావుపైనే. వేటు వేయడమే కాకుండా... ఆయనను సస్పెండ్ కూడా చేశారు. ఏసీబీ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అంతా పెద్ద తతంగమే నడిచింది. ఇప్పుడు ఇదే సీన్ తెలంగాణలో కూడా రిపీట్ అయ్యేలా ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కూడా.

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ ఐజీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ.ప్రభాకర్ రావును నాలుగేళ్లపాటు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగమేఘాల మీద ప్రభాకర్ రావు కూడా బాధ్యతలు చేపట్టారు. 1991లో డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయిలో విధుల్లో చేరిన ప్రభాకర్ రావు... పదేళ్ల తర్వాత కన్ ఫర్డ్ ఐపీఎస్ గా పదోన్నతి పొందారు. 29 ఏళ్ల పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పని చేసిన ఆయన గతేడాది పదవీ విరమణ చేశారు.

ఆయనకు నాలుగేళ్ల పాటు ఐజీగా బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు విమర్ళలు చేస్తున్నాయి. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని... తాము ఎవరితో మాట్లాడుతున్నామో... ఎటు వైపు వెళ్తున్నామో అనేదానిపైనే ఇంటెలిజెన్స్ బ్యూరో పని చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు. అసలు రిటైర్డ్ ఆఫీసర్ ను ఎందుకు తీసుకువచ్చారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట ఒకటే... అదే అక్కడ వెంకటేశ్వరరావు, ఇక్కడ ప్రభాకరరావు.



నిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?

కొత్త కారుతో షణ్ముఖ్ ఫొటో.. బీభత్సంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అందుకేనా..?

ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క.. కారణం అదేనా.. ?

లుక్ తో టాలీవుడ్ నే మెప్పించాడు.. బాలీవుడ్ కూడా ఫిదా!!

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

ఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?

మరో విజయసాయిరెడ్డిలా రేవంత్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>