PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi8a2deed3-df71-4d93-97ed-96133bef1d72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi8a2deed3-df71-4d93-97ed-96133bef1d72-415x250-IndiaHerald.jpgక‌రోనా ప‌రిస్థితులపై ఇవాళ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రికార్డు అవుతున్న కరోనా కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాల నుంచే 75శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో సంబంధిత రాష్ట్రాలను అ్రపమత్తం చేసేందుకు మోదీ ఈ వర్చువల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కోవిడ్‌ పరిస్థితులు, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. తదితర అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు. Modi{#}Kerala;Narendra Modi;Bhuma Akhila Priya;Prime Minister;Shakti;East;Coronavirusసీఎంల‌తో మోదీ వీడియో కాన్ఫరెన్స్సీఎంల‌తో మోదీ వీడియో కాన్ఫరెన్స్Modi{#}Kerala;Narendra Modi;Bhuma Akhila Priya;Prime Minister;Shakti;East;CoronavirusFri, 16 Jul 2021 09:06:17 GMTక‌రోనా ప‌రిస్థితులపై ఇవాళ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రికార్డు అవుతున్న కరోనా కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాల నుంచే 75శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో సంబంధిత రాష్ట్రాలను అ్రపమత్తం చేసేందుకు మోదీ ఈ వర్చువల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కోవిడ్‌ పరిస్థితులు, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. తదితర అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు.


క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా రూపాంతరం చెందుతుండడంతో.. రాష్ట్రాల్లో క‌ఠిన ప‌ర్యవేక్షణ ఉండాల‌ని, అన్ని రకాల వేరియంట్లను సునిశితంగా ప‌రిశీలించాల‌ని ఈ స‌మావేశంలో సీఎంలకు ప్రధాని సూచించ‌నున్నారు. క‌రోనా వేరియంట్లు, వాటి ప్రభావంపై నిపుణులు అధ్యయ‌నం చేస్తున్న విష‌యాన్ని వారికి వివ‌రించ‌నున్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా క‌ట్టడికి నివార‌ణ‌, చికిత్స కీల‌క‌మ‌ని, అంద‌రూ త‌ప్పనిస‌రిగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్రధాని సూచించ‌నున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన ఎనిమిది మంది సీఎంల‌తో మోదీ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


దేశంలో కరోనా హాట్‌ స్పాట్‌గా కేరళ కొనసాగుతోంది. నాలుగు ఆందోళనకర వేరియంట్లు కేరళను కుదిపేస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రాంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. డెల్టా వేరియంట్‌తో మహారాష్ట్ర, తూర్పు ఈశాన్య రాష్ట్రాలు ప్రమాదపు అంచుల్లో ఉంటే.. కేరళలో డెల్టాతో పాటు, ఆల్ఫా, బీటా, కప్పా వేరియంట్ల కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుండగా.. కొత్తగా మరోసారి 15 వేలకు పైగా కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ శాతం 14జిల్లాల్లో 10శాతం దాటేసింది.

మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్‌ వేరియంట్‌ పుట్టుకురావడం, లాక్‌డౌన్‌ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వంటి కారణాలు మూడో వేవ్‌ ముప్పునకు కారణమయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్‌ వేవ్‌ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.




గుడ్ న్యూస్..ఈ యాప్ తో ఇంట్లోనే కరోనా టెస్ట్.. !

అదరగొడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌.. ఈ లెక్కలు చూశారా..?

ఒలింపిక్స్ బరిలో వరల్డ్ నెం.1 !

" మా" ఎన్నికలు : మంచు విష్ణు కు నాగబాబు కౌంటర్ ?

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు..?

శ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?

యూవిసి టెక్నాలజీతో కరోనా పరార్..

మీకు కరోనా వచ్చి పోయిందా.. అయితే జాగ్రత్త సుమా..!

నక్క జిత్తుల చైనా కుట్రలను బయటపెట్టిన మీడియా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>