MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-comments-on-sivajiraja0d82982a-8225-4de9-9cfa-a17106c03116-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-comments-on-sivajiraja0d82982a-8225-4de9-9cfa-a17106c03116-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం గురించి జరుగుతున్న చర్చలు మరియు వివాదాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సొంత భవంతి నిర్మాణం పైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. `మా` కోసం సువిశాలంగా ఎకరం స్థలంలో 'మా' సొంత భవంతిని నిర్మించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఇంత వరకు సాధ్య పడలేదు.NAGABABU COMMENTS ON SIVAJIRAJA{#}Naresh;allari naresh;nidhi;Prakash Raj;Nagababu;Cinema'మా' స్కామ్ లో శివాజీ రాజాకు క్లీన్ చిట్ ?'మా' స్కామ్ లో శివాజీ రాజాకు క్లీన్ చిట్ ?NAGABABU COMMENTS ON SIVAJIRAJA{#}Naresh;allari naresh;nidhi;Prakash Raj;Nagababu;CinemaFri, 16 Jul 2021 13:00:00 GMTటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం గురించి జరుగుతున్న చర్చలు మరియు వివాదాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సొంత భవంతి నిర్మాణం పైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. `మా` కోసం సువిశాలంగా ఎకరం స్థలంలో 'మా' సొంత భవంతిని నిర్మించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఇంత వరకు సాధ్య పడలేదు. ఈ అంశంపై మరో సారి పలు విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై స్పందించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు మాజీ 'మా ' అధ్యక్షుడు శివాజీరాజా పాలనకు క్లీన్ చిట్ ఇచ్చారు. శివాజీరాజా అధ్యక్షుడిగా అమెరికాకు వెళ్లారు. అక్కడ అందరితో మాట్లాడి ఓ ప్రోగ్రామ్ నిర్వహించి.. మా సంఘానికి నిధిని సేకరించారు.

వాటిని అందరి సమ్మతంతోనే ఆర్టిస్టుల సంక్షేమం కొరకు వివిధ రకాలుగా వినియోగించడం జరిగింది అని పేర్కొన్నారు. ఇక్కడ క్లారిటీ లేకుండా ఏదీ లేదని మద్దతుగా మాట్లాడారు. `మా` అనేది  తెల్లని కాగితం లాంటిది. ఎవరైనా సరే అకౌంట్స్ గురించి తెలుసుకునే లాగే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి మిస్ యూజ్ జరగడానికి తావు లేదు. ఆ సేకరించిన నిధి దుర్వినియోగం అయింది అనడంలో అర్థం లేదు, అది  కరెక్ట్ కాదు కూడా అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వీకే నరేష్ హయాంలో  అంతగా ఎఫర్ట్ పెట్టలేదని. అసలు ఆ టైం లో ఏమి జరిగిందనే వివరాలు వారిని అడిగితేనే బావుంటుందేమో అని చెప్పారు.

కాగా ప్రకాష్ రాజ్  'మా ' అధ్యక్ష పదవిలోకి వస్తే `మా`  సొంత భవంతి కోసం కృషి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆ విషయంలో ఆయన పూర్తి క్లారిటీ పై ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలా వివిధ రకాలుగా 'మా' కు అధ్యక్షులుగా వ్యవహరించిన వారిపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలే సమయం ఉన్నందున ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. మరి ఎవరిని ఈ అధ్యక్ష పదవి వరించనుందో తెలియాల్సి ఉంది.



ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!

హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?

చరణ్, ఎన్టీఆర్ ... ఇక మార్గం సుగమమే ... ??

సినిమా హాళ్లు రీఓపెన్ అప్పుడే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>