PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/yogi-adithyanathd556652c-1939-42a5-9cb2-a12af3759bbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/yogi-adithyanathd556652c-1939-42a5-9cb2-a12af3759bbb-415x250-IndiaHerald.jpgఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇవాళ నిర్వహించనున్న యూపీ బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలోఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలతోపాటు కేబినెట్‌ విస్తరణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. Yogi Adithya{#}yogi;Narendra Modi;Prime Minister;Loksabha;Population;Bharatiya Janata Party;central government;Assembly;Minister;Party;CMయూపీలో మారుతున్న రాజకీయాలుయూపీలో మారుతున్న రాజకీయాలుYogi Adithya{#}yogi;Narendra Modi;Prime Minister;Loksabha;Population;Bharatiya Janata Party;central government;Assembly;Minister;Party;CMFri, 16 Jul 2021 09:20:39 GMTఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇవాళ నిర్వహించనున్న యూపీ బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలోఈ  అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలతోపాటు కేబినెట్‌ విస్తరణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.


కొద్దిరోజుల క్రితం కేంద్ర కేబినెట్‌లో ప్రధాని మోదీ కీలక మార్పులు చేయగా... ఇప్పుడు అదే బాటలో యోగి కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మోదీ కొత్త కేబినెట్‌లో యూపీ నుంచి ఏడుగురు ఎంపీలకు చోటు కల్పించారు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో యూపీ ఎంపీల సంఖ్య 14కు చేరింది. దీంతో ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచి ఇంత మందికి మంత్రి పదవులు దక్కడం ఇదే ప్రథమం. అయితే రానున్న అసెంబ్లీ  ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారికి మంత్రి పదవులు కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లును ప్రకటించిన యోగీ సర్కార్.. మరిన్న సంస్కరణలు తీసుకువచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది.



ఇటీవల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపై బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొనేందుకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని కేంద్రం కీలకంగా భావిస్తోంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ మరోసారి అధికారం సాధించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. అక్కడ సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ తాజా మార్పుతో అయినా... యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో చూడాల్సి ఉంది.





మమతా నెక్ట్స్ టార్గెట్‌ ఢిల్లీ..

సీఎంల‌తో మోదీ వీడియో కాన్ఫరెన్స్

గుట్కా మంత్రులకు ఈటల పరిస్థితి రానుందా..?

రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ

జాబ్ క్యాలెండర్.. జగన్ కంటే కేసీఆర్ కే ఎక్కువ సమస్యలు..

'గాంధీ' కుటుంబాన్ని వీడనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ?

కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>