Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahad-fazilb952ec10-8177-46d9-9ec8-ed4d85a0d7e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahad-fazilb952ec10-8177-46d9-9ec8-ed4d85a0d7e1-415x250-IndiaHerald.jpgఅతను తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా చేయలేదు. కాని తెలుగు ఆడియెన్స్ లో ఇప్పుడు అతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆహా వల్ల అతని సినిమాలన్ని తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి దానితో ఆ హీరోకి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంతకీ ఎవరా స్టార్ అంటే మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్. మళయాళంలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్Fahad-Fazil{#}Anu Malik;Allu Arjun;Cinema;cinema theater;Hero;Teluguతెలుగులో చేయకపోయినా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్..!తెలుగులో చేయకపోయినా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్..!Fahad-Fazil{#}Anu Malik;Allu Arjun;Cinema;cinema theater;Hero;TeluguFri, 16 Jul 2021 07:00:00 GMTఅతను తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా చేయలేదు. కాని తెలుగు ఆడియెన్స్ లో ఇప్పుడు అతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆహా వల్ల అతని సినిమాలన్ని తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి దానితో ఆ హీరోకి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంతకీ ఎవరా స్టార్ అంటే మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్. మళయాళంలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో తెలుగులో డైరెక్ట్ సినిమా చేసింది లేదు కాని అతని సినిమాలు డబ్ అయ్యి ఇక్కడ మంచి ఫలితాలు అందుకుంటున్నాయి.

ముఖ్యంగా తను చేసే సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండటం అది తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అవడం జరుగుతుంది. ఈమధ్య వచ్చిన అతని సినిమాలన్ని తెలుగులో హిట్ అవుతూ వస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఆహాలో మాత్రం అతని సినిమాలన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో ఆహాలో వచ్చినా ఫహద్ ఫాజిల్ సినిమాలన్ని మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన మాలిక్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఇదే క్రేజ్ తో ఇప్పుడు ఈ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఇన్నాళ్లు కేవలం మళయాళ స్టార్ గా మాత్రమే ఉన్న ఫహద్ ఫాజిల్ ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ సినిమాలో నటిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్నాడట ఫహద్ ఫాజిల్ ఈ సినిమా కోసం అతను కూడా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. చూస్తుంటే సౌత్ సినీ పరిశ్రమలో మరో విలక్షణ నటుడు పుట్టుకొచ్చాడని చెప్పొచ్చు. కేవలం హీరోగానే కాదు ఎలాంటి పాత్రలనైనా చేఏసే ఫహద్ ఫాజిల్ కు తెలుగులో కూడా లాంగ్ కెరియర్ ఉంటుందని చెప్పొచ్చు. మరి డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న అతను పుష్ప సినిమాలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.





ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

స్వీటీకి బ్యాడ్ టైమ్..!

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>