Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastar-chiranjeevi-gang-leader-back-story635c8887-ea13-4ac7-87c3-92c9dbc745c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastar-chiranjeevi-gang-leader-back-story635c8887-ea13-4ac7-87c3-92c9dbc745c7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. అయితే వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో ఒకటి గ్యాంగ్ లీడర్. విజయ బాపినీడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ముందు చిరుతో తీయాలని అనుకోలేదట. చిరు ఇమేజ్ ను డబుల్ చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ముందు చిరంజీవి కోసం రాసుకున్న కథ కాదట చిరు తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కోసం రాసుకున్నారటMegastar-Chiranjeevi-Gang-Leader-Back-Story{#}vijaya baapineedu;Thief;Gang Leader;Donga;Annayya;Mass;Nagababu;naga;Chiranjeevi;Success;Cinemaమెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' వెనుక ఇంత కథ నడిచిందా..!మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' వెనుక ఇంత కథ నడిచిందా..!Megastar-Chiranjeevi-Gang-Leader-Back-Story{#}vijaya baapineedu;Thief;Gang Leader;Donga;Annayya;Mass;Nagababu;naga;Chiranjeevi;Success;CinemaFri, 16 Jul 2021 17:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. అయితే వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో ఒకటి గ్యాంగ్ లీడర్. విజయ బాపినీడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ముందు చిరుతో తీయాలని అనుకోలేదట. చిరు ఇమేజ్ ను డబుల్ చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ముందు చిరంజీవి కోసం రాసుకున్న కథ కాదట చిరు తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కోసం రాసుకున్నారట. అప్పటికే చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నాగ బాబు కూడా నటించి మెప్పించాడు. ఆ సినిమాలో మెగా బ్రదర్ నటన చూసిన పరుచూసి సోదరులు నాగబాబు హీరోగా కూడా మెప్పిస్తాడని అన్నారట.

ఈ క్రమంలోనే తనని హీరోగా పెట్టి డైరక్టర్ విజయ బాపినీడుని ఒక స్టోరీని సిద్ధం చేయమని చెప్పడంతో గ్యాంగ్ లీడర్ కథ రాసుకున్నాడట. ఆ సినిమాకు అరె ఓ సాంబ టైటిల్ అనుకున్నారట. అయితే కథ బాగా రావడంతో బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అవుతుందని భావించి అన్నయ్య చిరంజీవికి ఈ కథ ఇచ్చేయండని చెప్పాడట నాగ బాబు. చిరు అనేసరికి కొన్ని మాస్ డైలాగ్స్, కథలో కొన్ని మార్పులు చేశారట.

అలా నాగబాబుకి అనుకున్న గ్యాంగ్ లీడర్ కాస్త చిరు చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. 1991లో రిలీజైన ఈ సినిమా అప్పటిలో అన్ని రికార్డులను తిరగ రాసింది. మెగాస్టార్ చిరంజీవికి గ్యాంగ్ లీడర్ సినిమా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అప్పటి యూత్ కు ఈ సినిమా చాలా బాగా ఎక్కేసింది. అంతేకాదు సినిమాలోని సాంగ్స్ కూడా అందరిని మెప్పించాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్ తో పాటుగా చిరు చాలా సినిమాల వరకు ఆ సక్సెస్ మేనియా కొనసాగించారు.







కొత్త కారుతో షణ్ముఖ్ ఫొటో.. బీభత్సంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అందుకేనా..?

ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?

తగ్గేదే లే... యష్ కూడా స్టార్ట్ చేశాడు !

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క.. కారణం అదేనా.. ?

లుక్ తో టాలీవుడ్ నే మెప్పించాడు.. బాలీవుడ్ కూడా ఫిదా!!

మహేష్ బాబు కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' వెనుక ఇంత కథ నడిచిందా. నాగబాబు కోసం అనుకున్న కథ మార్చి చిరుతో తీసిన సినిమా.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దీన్నీ వదలరా!!

విజయ్ దేవరకొండ చెప్పి మరీ కొడుతున్నాడు గా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>