MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashi-kanna-planing-a-webseries5a8ca1f7-349e-4a3f-9707-f5eac956bd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashi-kanna-planing-a-webseries5a8ca1f7-349e-4a3f-9707-f5eac956bd83-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు ఏవో కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి. వీటిని కొందరు స్వాగతిస్తే మరికొందరు ఇది సినిమాకు ,థియేటర్లకు నష్టాన్ని కలిగిస్తుంది అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలలో ముఖ్యమైనవి 'వెబ్ సిరీస్' లు అని చెప్పవచ్చు. మొదట చిన్న నటీనటుల తో వీటిని తెరకెక్కించారు . కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు 'ఓ టి టి' సంస్థల మధ్య పెరిగిన పోటీ కారణంగా స్టార్ నటీనటుల తో వీటినే తెరకెక్కించడానికి సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. అRashi kanna{#}kajal aggarwal;raasi;tamannaah bhatia;Goa;Horror;vegetable market;Shahid Kapoor;raj;Indian;News;Heroine;Director;Samantha;Teluguఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!Rashi kanna{#}kajal aggarwal;raasi;tamannaah bhatia;Goa;Horror;vegetable market;Shahid Kapoor;raj;Indian;News;Heroine;Director;Samantha;TeluguFri, 16 Jul 2021 08:16:00 GMTసినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు ఏవో కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి. వీటిని కొందరు స్వాగతిస్తే మరికొందరు ఇది సినిమాకు ,థియేటర్లకు నష్టాన్ని కలిగిస్తుంది అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాలలో ముఖ్యమైనవి 'వెబ్ సిరీస్' లు అని చెప్పవచ్చు. మొదట చిన్న నటీనటుల తో వీటిని తెరకెక్కించారు . కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి  లేదు 'ఓ టి టి' సంస్థల మధ్య పెరిగిన పోటీ కారణంగా  స్టార్ నటీనటుల తో వీటినే తెరకెక్కించడానికి సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి.


 అందులో భాగంగానే కాజల్ ఇప్పటికే 'లైవ్ టెలికాస్ట్' అనే హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన  సిరీస్ లో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అదే ఊపులో మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా తమన్నా  '11th అవర్' అనే  సిరీస్ లో ఒక ఉమెన్ ఐకాన్గా,  'నవంబర్ స్టోరీ' అనే క్రైమ్ త్రిలర్ లో  నటించి అభిమానుల నుంచి మంచి మార్కులే వేయించుకుంది. మరొక స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా ఇండియాస్ మోస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మాన్ 2' లో నటించింది. ప్రస్తుతం వీరి బాటలోనే రాశి ఖాన్నా కూడా అడుగులు వేస్తోంది.  ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా 'ది ఫ్యామిలీ మాన్' డైరెక్టర్ లు అయినా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఒక సిరీస్ లో నటించడానికి ఈ ముద్దుగుమ్మ అంగీకరించింది.


ప్రస్తుతం దీని షూటింగ్ గోవా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా 'సోనీ లివ్' సంస్థ వారు రాశి ఖాన్నా తో ఒక స్ట్రీట్ తెలుగు వెబ్ సిరీస్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సంస్థ  ఇతర భాషల్లో రిలీజ్ అయిన సిరీస్ లను తెలుగులో  డబ్బింగ్ చేసి విడుదల చేసేవారు.  తెలుగులో వాళ్ళ మార్కెట్ పెంచుకునేందుకు ఈ ముద్దుగుమ్మ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

ఆ ఇంట్లో ఐదుగురు కలెక్టర్ లే..!

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..

ఒక్కపుడు ఫుడ్ సెంటర్ లో పని.. ఇప్పుడు స్టార్ హీరో..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>