PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/big-shock-for-kcr1aaa482e-6a99-44fd-beba-582ed7d75652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/big-shock-for-kcr1aaa482e-6a99-44fd-beba-582ed7d75652-415x250-IndiaHerald.jpgకృష్ణా, గోదావరి బోర్టుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం... తమ పనిని సమర్థించుకుంది. విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగినట్లు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ లోని వివరాలను జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్ కే హాల్దర్, సీడబ్ల్యూసీ సభ్యుడు కే వోహ్రా కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో గెజిట్ లోని వివరాలను వెల్లడించారు.Central{#}Parliment;October;september;media;Shakti;Telugu;central government;Telangana;Godavari River;Aquaగెజిట్ నోటిఫికేషన్ పై కేంద్రం క్లారిటీగెజిట్ నోటిఫికేషన్ పై కేంద్రం క్లారిటీCentral{#}Parliment;October;september;media;Shakti;Telugu;central government;Telangana;Godavari River;AquaFri, 16 Jul 2021 18:46:00 GMTకృష్ణా, గోదావరి బోర్టుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం... తమ పనిని సమర్థించుకుంది. విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగినట్లు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ లోని వివరాలను జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్ కే హాల్దర్, సీడబ్ల్యూసీ సభ్యుడు కే వోహ్రా కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో గెజిట్ లోని వివరాలను వెల్లడించారు.
 
విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేశామన్నారు. గతేడాది అక్టోబర్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్ పై చర్చించినట్లు సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్తీ వెల్లడించారు. సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందన్నారు. ఇందులో కేంద్ర జల్ శక్తితో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారన్నారు. 2016 సెప్టెంబర్ లో తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశమైందని.. అయితే కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని వెల్లడించారు.

2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేసినట్లు సంజయ్ అవస్థీ వెల్లడించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లులకు ఎంత కసరత్తు ఉంటుందో... అంతకు రెట్టింపు స్థాయిలో నోటిఫికేషన్ కు సంబంధించి కసరత్తు చేశామన్నారు అవస్తీ.  అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ నోటిఫికేషన్ రూపొందించినట్లు సంజయ్ అవస్థీ మరోసారి స్పష్టం చేశారు. నీటి నిర్వహణ చాలా సున్నితమైన అంశమన్నారు. నోటిఫై చేయడానికి ముందు అనేక సార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. రెండు రాష్ట్రాల నుంచి అనేక అంశాలు సేకరించిన తర్వాతే నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగా బోర్డులు నీటిని విడుదల చేస్తాయన్నారు. తెలంగాణ కోరినట్లుగా కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖను సలహా కోరామన్నారు సంజయ్ అవస్థీ. న్యాయశాఖ కోరిన వివరాలు అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న అంశం తమకు తెలుసన్నారు కేంద్ర జల్ శక్తీ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ.



'రికార్డులు కాదు,టాక్స్ కట్టడం ముఖ్యం బిగిలు'.. విజయ్ పై ట్రోల్స్..

రేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారు

కోకాపేటలో చేతులు మారిన రూ.వెయ్యి కోట్లు

వాయిదా పడ్డ జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు.. ఎప్పుడంటే..?

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?

నయన్ డిజిటల్ ఎంట్రీ... ఆ హీరోయిన్ వదిలేసిన పాత్రలో....!

కేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?

తెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?

నిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>