MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-face-big-shock-from-makers-d67a8aad-9d03-40af-a762-54bb27a8d8d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-face-big-shock-from-makers-d67a8aad-9d03-40af-a762-54bb27a8d8d9-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల మీద సినిమాలు చేస్తూ జోరు మీద ఉంది. తమన్నా కెరీర్ ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఉంది. ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. టాప్ స్టార్స్ అందరి పక్కన నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమెకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. tamanna{#}tamannaah bhatiaతమన్నాకు షాకుల మీద షాకులు... ?తమన్నాకు షాకుల మీద షాకులు... ?tamanna{#}tamannaah bhatiaFri, 16 Jul 2021 19:02:09 GMTమిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల మీద సినిమాలు చేస్తూ జోరు మీద ఉంది. తమన్నా కెరీర్ ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఉంది. ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. టాప్ స్టార్స్ అందరి పక్కన నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమెకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.

అయితే ఆమెకు సరైన హిట్లు మాత్రం పడడంలేదు. పైగా చేసిన సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కావడంలేదు. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫారాన్ని తమన్నా టచ్ చేసింది. ఆమె చేసిన వెబ్ సిరీస్ కి పెద్దగా ఆదరణ దక్కలేదు. దాంతో ఆమె సినిమాల మీదనే ఆశలు పెట్టుకుంది. దాంతో పాటు ఆమె చాలెంజిగా తీసుకుని చెసిన మాస్ట్రో సినిమా  రిలీజ్ కి రెడీగా ఉంది. అంధాధూన్ హిందీ మూవీకి ఇది రీమేక్. ఆ మూవీలో టబు నటించిన పాత్రను తమన్నా తెలుగులో  ప్లే చేసింది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ టబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తమన్నాకు కూడా పేరు వస్తుందని ఆశించింది. కానీ మాస్ట్రోని థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీ కి ఇస్తారని అంటున్నారు. దాంతో తమన్నా ఆశలు ఒక్కసారిగా నీరుకారిపోతున్నాయి అంటున్నారు.  ఈ మూవీ థియేటర్లలో వస్తే కచ్చితంగా తమన్నా రేంజి మరింత పెరిగేది అంటున్నారు.

మరో వైపు చూస్తే వెంకటేష్ తో చేసిన ఎఫ్ త్రీ  మూవీ కూడా ఓటీటీ బాట పడుతోంది అంటున్నారు. ఎఫ్ టూ రెండేళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయి బంపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత తమన్నాకు సక్సెస్ అంటూ లేకుండా పోయింది. ఇపుడు కచ్చితంగా హిట్ అవుతాయనుకుంటున్న మూవీస్ రెండూ ఓటీటీ బాట పడితే కెరీర్ ఎలా అంటూ తమన్నా తల పట్టుకుంటోందిట. అయినా ఇపుడు థియేటర్లలో సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అన్నీ చక్కబడేంతవరకూ మేకర్స్ వేచిచూడడంలేదు. మరి ఇది తమన్నాకు ఇబ్బంది అనిపించినా అనివార్యం అంటున్నారు మేకర్స్.

 






మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల మీద సినిమాలు చేస్తూ జోరు మీద ఉంది. తమన్నా కెరీర్ ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఉంది. ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. టాప్ స్టార్స్ అందరి పక్కన నటించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమెకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.

లౌక్యమైన అడుగువేసిన గోపీచంద్ హిట్ లక్ష్యాన్ని చేధిస్తాడా!

ఎఫ్ త్రీ కి అతడే హైలెట్ అట..!

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>