EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane8f47d4f-d8be-4d6d-a5ef-fa26ad7d05de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagane8f47d4f-d8be-4d6d-a5ef-fa26ad7d05de-415x250-IndiaHerald.jpgదేశ ద్రోహం చట్టం గురించి నిన్న సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్యోద్యమ కారులపై ప్రయోగించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహచట్టం దుర్వినియోగమవుతోందని... అనేక వలస చట్టాలను, ఉపయోగంలో లేని వాటిని రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయంపై ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీసింది. అసలు ఈ దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయjagan{#}local language;Yevaru;TDP;Jagan;central government;Kanumuru Raghu Rama Krishnam Rajuసుప్రీంకోర్టు దేశద్రోహం వ్యాఖ్యలు.. జగన్‌ గురించేనా..?సుప్రీంకోర్టు దేశద్రోహం వ్యాఖ్యలు.. జగన్‌ గురించేనా..?jagan{#}local language;Yevaru;TDP;Jagan;central government;Kanumuru Raghu Rama Krishnam RajuFri, 16 Jul 2021 07:00:00 GMTదేశ ద్రోహం చట్టం గురించి నిన్న సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్యోద్యమ కారులపై ప్రయోగించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహచట్టం దుర్వినియోగమవుతోందని... అనేక వలస చట్టాలను, ఉపయోగంలో లేని వాటిని రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయంపై ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీసింది. అసలు ఈ దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


అయితే ఈ కేసు గురించి సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కారును ఉద్దేశించి చేసినవా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి కొందరు ఫ్యాక్షనిస్టులు  అధికారదాహంతో బెదిరింపులకు పాల్పడుతూ కొందరికి బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలు ఇటీవలి రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్‌ను తలపించాయి. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారంలో ఉన్నవారిలో ఫ్యాక్షనిస్టులు ఉన్నారని చెప్పకనే చెప్పినట్టయింది.


మరి అలాంటి నేపథ్యం ఉన్న పాలకులు ఎవరు అని ఆలోచిస్తే.. అది జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అయిఉండొచ్చన్న ఆలోచన కలగడం సహజం. అంతే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై, గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు ఏపీలో జరిగాయి కూడా. రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికి 124-Aసెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలున్నాయని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


అధికార దాహంతో స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యర్ధులపై రాజద్రోహం మోపేలా కూడా వ్యవహరిస్తున్న ఉదాహరణలు ఉన్నాయని... ఈ సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని కామెంట్ చేయడం కూడా గమనించాలి. ఒకవేళ ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు అన్ని ఘటనలనూ పరిగణలోకి తీసుకుని చేసినా.. దీన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా దేశ ద్రోహం గురించి సుప్రీం చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ చట్టం రద్దుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.



" మా" ఎన్నికలు : మంచు విష్ణు కు నాగబాబు కౌంటర్ ?

పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

"కైలాస గుడి"ని ఎలా నిర్మించారో తెలుసా ?

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..

ప్రాజెక్టులన్నీ ఢిల్లీ పరిధిలోనే..

శ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?

దెందులూరులో హాట్‌హాట్ పాలిటిక్స్

జగన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స్పీకర్.. తలపోటు తప్పేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అచ్చెన్నకు చెక్ పెట్టేసినట్లేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>