PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-tdp-situationc89a56c5-7aa2-4ec4-bd5f-6f505fb35208-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-tdp-situationc89a56c5-7aa2-4ec4-bd5f-6f505fb35208-415x250-IndiaHerald.jpgఒక రాజకీయ నాయకుడిగా అధికార పార్టీలో ఉన్నా లేదా ప్రతి పక్ష పార్టీలో ఉన్నా వారి కర్తవ్యం ఒక్కటే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడం. అధికారంలో ఉంటే ప్రజా ప్రయోజన పథకాలకు లేదా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండాలి. ఒకవేళ ప్రతి పక్షంలో ఉన్నట్లయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమయితే లేదా చేయకుండా జాప్యం చేస్తుంటే వారిని ప్రశ్నించాలి ?AP-TDP-SITUATION{#}revanth;Revanth Reddy;TPCC;Petrol;Kartavyam;Diesel;TDP;Aqua;Party;CM;Reddyప్రజలకు అవసరం లేని డిమాండ్లపై నిరసనలేల ?ప్రజలకు అవసరం లేని డిమాండ్లపై నిరసనలేల ?AP-TDP-SITUATION{#}revanth;Revanth Reddy;TPCC;Petrol;Kartavyam;Diesel;TDP;Aqua;Party;CM;ReddyFri, 16 Jul 2021 11:00:00 GMTఒక రాజకీయ నాయకుడిగా అధికార పార్టీలో ఉన్నా లేదా ప్రతి పక్ష పార్టీలో ఉన్నా వారి కర్తవ్యం ఒక్కటే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడం. అధికారంలో ఉంటే ప్రజా ప్రయోజన పథకాలకు లేదా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండాలి. ఒకవేళ ప్రతి పక్షంలో ఉన్నట్లయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమయితే లేదా చేయకుండా జాప్యం చేస్తుంటే వారిని ప్రశ్నించాలి ? కొన్ని కొన్ని సార్లు అత్యవసరమయితే నిరసనలు చేపట్టి అధికార పార్టీ మెడలు వంచాలి. కానీ కొన్ని సార్లు కొందరు నాయకులు పార్టీ అధ్యక్షుల వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అవసరం లేని డిమాండ్లకు నిరసనలు చేపడుతూ ప్రజల్లో మరియు పార్టీలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటూ ఉంటారు.

ఒకవైపు ఏపీకి మరియు తెలంగాణకు మధ్యన జలవివాదం ఎంతలా ముదిరిపోతుందో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అంశంపై మాట్లాడని టీడీపీ నాయకులు, వివిధ అంశాలపై మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అందరికీ క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అవసరం లేని, ప్రజలకు ప్రయోజనం కాని అంశంపై నిరసనలు చేస్తూ మరోసారి టీడీపీ పరువు తీస్తున్నారు. ఇందులో భాగంగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కూడా వీరికి సొంతంగా ఆలోచన వచ్చి ఉంటే సరే, కానీ మాజీ టీడీపీ నాయకుడు మరియు ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ పెట్రోల్ మరియు డీజిల్ అంశంపై ఆందోళనలు చేపడుతున్నారు.

రేవంత్అ రెడ్డి లాగా చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న టీడీపీ నాయకులలో ఎవ్వరూ రేవంత్ రెడ్డిలాగా లేరని అర్ధం చేసుకోవాలి.  అలా కాకుండా ఏపీకి మద్దతుగా జల వివాదంపై ప్రభుత్వానికి అండగా నిలబడి పోరాటం చేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన. మరి ఇక ముందైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలపై టీడీపీ తమ్ముళ్లు గళం విప్పుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.



బ్రేకింగ్: జగన్ నిర్ణయం విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం...?

‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!

కేసీఆర్ స‌మ‌క్షంలో నేడు కారెక్క‌నున్న ర‌మ‌ణ‌.. !

ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్

పెట్రోల్ కంటే లిక్కర్ చీప్.. మంత్రి షాకింగ్ కామెంట్స్?

సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్...వీటి పైనే చర్చ.. !

గుడ్‌ న్యూస్ చెప్పిన జగన్.. ప్రభుత్వోద్యోగులకు మాత్రమే..!

లవ్ స్టొరీ టక్ జగదీశ్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆరోజు !

యూపీలో మారుతున్న రాజకీయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>