PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf0eea607-ce9b-4e86-8974-423dcef73ec0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganf0eea607-ce9b-4e86-8974-423dcef73ec0-415x250-IndiaHerald.jpgకేవలం ఇరవై నాలుగు గంటలలో సీన్ మొత్తం మారింది. జాతీయ స్థాయిలో పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా జత కలవడంతో ఏపీకి, ప్రత్యేకించి వైసీపీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. దంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాలిటిక్స్ కూడా కీలకమైన మార్పులు వచ్చేలా సీన్ కనిపిస్తోంది. jagan{#}YCPజగన్ కి భారీ గిఫ్ట్ ఇచ్చేసిన మోడీ... ?జగన్ కి భారీ గిఫ్ట్ ఇచ్చేసిన మోడీ... ?jagan{#}YCPFri, 16 Jul 2021 20:19:00 GMT
ఏపీ తెలంగాణాల మధ్య మొదలైన జల జగడం చివరకి సుఖాంతం అయ్యేలా కేంద్రం వేగంగా పావులు కదిపిందింది. అదే సమయంలో ఏపీకి కొంత ఫేవర్ గా ఉన్నట్లుగా కూడా పరిణామాలు కనిపించాయి. రెండు రాష్ట్రాలకు పెత్తనం లేకుండా బోర్డులకే అధికారాలు ఇస్తూ జగన్ కోరిన విధంగానే కేంద్రం  నిర్ణయం తీసుకుంది. ఇది జగన్ సాధించిన విజయంగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

అదే టైమ్ లో తెలంగాణాకు కొంత షాక్ లాంటి పరిణామమే ఇది అంటున్నారు. ఎందుకంటే ఎగువ రాష్ట్రానికి ఎపుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని వారు వాడుకుంటున్నారు. ఇపుడు కేంద్రం బోర్డులకు పెత్తనం ఇవ్వడంతో చేతులు కట్టేసినట్లు అయింది. అదే సమయంలో ఏపీ తెలంగాణాల మధ్య నీటి తగాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లే అవుతోంది. దీనికి ముందు చూస్తే పార్లమెంట్ కి కేవలం జల వివాదాల నేపధ్యంలో స్టాల్ చేయాలని వైసీపీ ఎంపీల సమావేశంలో జగన్ గట్టిగానే దిశా నిర్దేశం చేశారు. అసలే విపక్షాలు మోడీ సర్కార్ మీద పెద్ద ఎత్తున  దాడికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ కూడా సభలో రభస చేస్తే బాగుండదు అన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం ఇలా తక్షణ నిర్ణయం తీసుకుంది అంటున్నారు.

అదే విధంగా ప్రశాంత్ కిషోర్ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకత్రాటి మీదకు తెస్తున్నారు. దాంతో ఆయన ఏపీలో జగన్ తో కూడా చర్చించి విపక్ష శిబిరానికి తెస్తారన్న సమాచారం కూడా ఉండడంతో బీజేపీ జాగ్రత్త పడింది అంటున్నారు. అందుకే రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద కూడా వేటువేసేందుకు కూడా కేంద్రం దూకుడుగా పావులు కదిపేందుకు సిద్ధమవుతోంది అంటున్నారు. ఇక మిగిలింది స్టీల్ ప్లాంట్ ఇష్యూ. ఈ విషయంలో కేంద్రం ఏపీకి ఏ రకమైన హామీ ఇస్తుందో చూడాలి. ప్రత్యేక హోదా ఎటూ తేలదు, విభజన హామీలు నెమ్మదిగా తీర్చేవే. మొత్తానికి జగన్ కి భారీ గిఫ్టులనే కేంద్రం ఇచ్చింది అంటున్నారు.





కేవలం ఇరవై నాలుగు గంటలలో సీన్ మొత్తం మారింది. జాతీయ స్థాయిలో పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా జత కలవడంతో ఏపీకి, ప్రత్యేకించి వైసీపీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. దంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాలిటిక్స్ కూడా కీలకమైన మార్పులు వచ్చేలా సీన్ కనిపిస్తోంది.

కోకాపేటలో చేతులు మారిన రూ.వెయ్యి కోట్లు

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?

ఏపీలో ఉద్యోగాలివ్వ‌నున్న జ‌న‌సేన‌?

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

వివాదాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో

ఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?

మరో విజయసాయిరెడ్డిలా రేవంత్

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>