PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy7a86a206-f029-461d-8cb9-b3b4d203392a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy7a86a206-f029-461d-8cb9-b3b4d203392a-415x250-IndiaHerald.jpgఅక్కడ విజయసాయిరెడ్డి... ఇక్కడ రేవంత్ రెడ్డి... ప్రస్తుతం ఢిల్లీలో బలంగా వినిపిస్తున్న మాట ఇదే. అసలు విజయసాయిరెడ్డికి, రేవంత్ కు సంబంధం ఏమిటీ... వాళ్లిద్దరి గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారనే కదా అనుమానం.Revanth{#}lotus;Leader;Master;YCP;Parliment;Bharatiya Janata Party;Jagan;Telugu Desam Party;rahul;Rahul Sipligunj;court;TPCC;Telangana Rashtra Samithi TRS;CBN;Congress;Delhi;central government;revanth;TDP;Party;Newsమరో విజయసాయిరెడ్డిలా రేవంత్మరో విజయసాయిరెడ్డిలా రేవంత్Revanth{#}lotus;Leader;Master;YCP;Parliment;Bharatiya Janata Party;Jagan;Telugu Desam Party;rahul;Rahul Sipligunj;court;TPCC;Telangana Rashtra Samithi TRS;CBN;Congress;Delhi;central government;revanth;TDP;Party;NewsFri, 16 Jul 2021 16:07:04 GMTఅక్కడ విజయసాయిరెడ్డి... ఇక్కడ రేవంత్ రెడ్డి... ప్రస్తుతం ఢిల్లీలో బలంగా వినిపిస్తున్న మాట ఇదే. అసలు విజయసాయిరెడ్డికి, రేవంత్ కు సంబంధం ఏమిటీ... వాళ్లిద్దరి గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారనే కదా అనుమానం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని అన్నీ తానే అయి నడిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో అటు ఏపీలో పర్యటనలు, పార్టీ నేతలతో సమావేశాలు, కోర్టు కేసులు, వీటితో పాటు ఢిల్లీ స్థాయిలో పార్టీని నడిపించిన వ్యక్తి కూడా, ఒక్కమాటలో చెప్పాలంటే... టీడీపీ, బీజేపీ మధ్య బెడిసికొట్టిన తర్వాత.... వైసీపీ తరఫున కమలం నేతలతో సత్సంబంధాలు నడిపిన వ్యక్తి కూడా సాయిరెడ్డి.
 
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దల అండతో... చంద్రబాబును సమర్థంగా అడ్డుకున్న లీడర్ గా సాయిరెడ్డికి పేరుంది. కమలం పార్టీ అగ్రనేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు కూడా చంద్రబాబు అండ్ కో పై ఘాటుగా విమర్ళలు చేయడం వెనుక సాయిరెడ్డి హస్తం ఉందనేది హస్తిన వీధుల్లో పుకారు కూడా. ఇప్పుడు రేవంత్ గురించి కూడా అదే స్థాయిలో చర్చించుకుంటున్నారు కేంద్ర పెద్దలు. పార్టీలో సీనియర్లను కాదని టీపీసీసీ పదవి దక్కించుకునేందుకు రేవంత్ బలమైన లాబీయింగ్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య సంధానకర్తగా రేవంత్ వ్యవహరిస్తున్నాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అగ్గనేతగా, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా గుర్తింపున్న రేవంత్.. బాబుగారి అనుమతితో ఆశీర్వచనంతోనే కాంగ్రెస్ తీర్ఖం పుచ్చుకున్నారనేది పార్టీ పెద్దల మాట. అనూహ్యంగా 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవడం వెనుక కూడా రేవంత్ లాబీయింగ్ నడిచిందని చెబుతున్నారు. ఆ తర్వాత రేవంత్ కోసం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అధినేత సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసినట్లు సమాచారం కూడా. ఇక ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగవ్వడంతో... టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు తయారు చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇందులో భాగంగానే తన ప్రియ శిష్యుడు రేవంత్ కు టీపీసీసీ పదవి దక్కేలా చేశాడని అంటున్నారు.

గురు దక్షిణ చెల్లించుకునేందుకు కూడా రేవంత్ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారితో కలిసి బాబుగారికి ఫేవర్ గా రేవంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటు ఏపీలో వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయడంతో పాటు... అటు కేంద్రంలో మోదీని అడ్డుకోవాలంటే బాబు లాంటి మాస్టర్ బ్రెయిన్ తప్పనిసరి అనే మాటను ప్రస్తుతం ఢిల్లీ పెద్దలకు రేవంత్ చేరవేసినట్లుగా సమాచారం. భవిష్యత్తులో అక్కడ రాహుల్ ను, ఏపీలో చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగానే ఉంది. చూడాలి భవిష్యత్తు రాజీ కీయం ఎలా ఉంటుందో మరి.



ఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?

వైద్య వృత్తికి దూరమై ఐఏఎస్ అధికారిగా గుర్తింపు..

ప‌వ‌న్‌తో సంబంధం లేకుండా జ‌న‌సైనికుల రాజ‌కీయం ?

కియారా అద్వానికి పోటీ వస్తున్న అలియా..!

ఎవరు ఇన్‌? ఎవరు అవుట్?

వెంక‌టేష్‌కు అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

ప్ర‌తి వ్య‌క్తి మీద మోడీ, కేసీఆర్ 6ల‌క్ష‌ల అప్పు..?

ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన కొత్త ఫీచర్ ?

బాల‌య్య ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా.. మాజీ సీఎం సంచ‌ల‌న నిజాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>