MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty27a72abb-3bf3-4897-afd2-afbc3403cfa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty27a72abb-3bf3-4897-afd2-afbc3403cfa0-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆమె "జల జల జలపాతం నువ్వు" పాటలో హీరో వైష్ణవ్ తేజ్ తో కలసి బీభత్సమైన రొమాన్స్ చేశారు. మొట్టమొదటి సినిమాలోనే ఆమె బాగా రొమాన్స్ చేసి కుర్రకారు మతులు పోగొట్టారు. బుచ్చిబాబు సనా అద్భుతంగా రూపొందించిన ఉప్పెన సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సుమధుర సంగీతం ప్రాణం పోసింది. ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ తన అమాయకమైన, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్లతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. ఆమె తన నటనా పKrithi shetty{#}sana;sudheer babu;sree;Akkineni Nagarjuna;Kannada;Music;ram pothineni;Tollywood;Nani;Naga Chaitanya;Aqua;Heroine;Hero;krishna;Cinemaనాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?Krithi shetty{#}sana;sudheer babu;sree;Akkineni Nagarjuna;Kannada;Music;ram pothineni;Tollywood;Nani;Naga Chaitanya;Aqua;Heroine;Hero;krishna;CinemaFri, 16 Jul 2021 14:00:00 GMTఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆమె "జల జల జలపాతం నువ్వు" పాటలో హీరో వైష్ణవ్ తేజ్ తో కలసి బీభత్సమైన రొమాన్స్ చేశారు. మొట్టమొదటి సినిమాలోనే ఆమె బాగా రొమాన్స్ చేసి కుర్రకారు మతులు పోగొట్టారు. బుచ్చిబాబు సనా అద్భుతంగా రూపొందించిన ఉప్పెన సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సుమధుర సంగీతం ప్రాణం పోసింది. ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ తన అమాయకమైన, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్లతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. ఆమె తన నటనా ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఉప్పెన తర్వాత ఆమె వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని, లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే నాచురల్ స్టార్ నాని సరసన "శ్యామ్ సింగరాయ్" సినిమాలో నటిస్తున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న మరో సినిమా లో కూడా ఆమె కనిపించనున్నారు.

అయితే తాజాగా ఆమెకు అక్కినేని నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు సినిమా లో నాగచైతన్య నటిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టిని నటింపజేయాలని నాగార్జున అనుకున్నారట. ఈ మేరకు ఆయన ఆమెను సంప్రదించారట. కానీ కృతి ఆఫర్ రిజల్ట్ చేసినట్లు సమాచారం. దీంతో నాగార్జున షాక్ అయినట్లు తెలుస్తోంది. ఆమె నాగార్జున ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. సినీ వర్గాలు మాత్రం కృతి శెట్టి కేవలం స్టార్ హీరోల సరసన మాత్రమే నటించడానికి ఇష్టపడుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఆమె కేవలం హీరోయిన్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. రెండవ హీరోయిన్ గా లేదా సైడ్ హీరోయిన్ గా కనిపించడానికి ఆమె అసలు ఇష్టపడడం లేదట. ఈ కారణంతోనే ఆమె నాగార్జున ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉంటారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.





కత్తి మహేష్ మైనింగ్ డీల్స్.. సెక్రెట్స్ బయటపెట్టిన బిజినెస్ పార్టనర్

కేజిఎఫ్ చాప్టర్-2 నేడే విడుదల?

లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

హీరోని ముఖ్యమంత్రిని చేస్తున్నారు..!

జక్కన్న చేతుల మీదుగా హిందీ చత్రపతి లాంచ్.. !

నాగార్జున మొద‌టి భార్య‌కు ఆ కార‌ణంతోనే విడాకులు ఇచ్చాడా ?

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>