PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud1141510-f942-4d9c-90b3-d3c07a10bd51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud1141510-f942-4d9c-90b3-d3c07a10bd51-415x250-IndiaHerald.jpgత‌ర్వాత ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకున్న‌ది లేదు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవ‌డంలో నాయ‌కులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. కోట్ల కుటుంబం రాజ‌కీయాల నేప‌థ్యంలో ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లోపేత‌మైంది. తొలినాళ్ల‌లో బాగానే పుంజుకుంటుంద‌న్న ద‌శ‌లో ఉన్న టీడీపీ.. త‌ర్వాత చ‌తికిల ప‌డింది. దీంతో 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ పొత్తులో భాగంగా.. సీపీఐకి ఈ టికెట్ కేటాయించింది. ఇది మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా పార్టీchandra babu{#}Alur;YCP;Bhuma Akhila Priya;District;Congress;TDP;Hanu Raghavapudi;Party;AdiNarayanaReddyఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?ఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?chandra babu{#}Alur;YCP;Bhuma Akhila Priya;District;Congress;TDP;Hanu Raghavapudi;Party;AdiNarayanaReddyFri, 16 Jul 2021 16:27:00 GMTక‌ర్నూలు జిల్లా అంటే... టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌. కేఈ కుటుంబం ఒక‌వైపు.. భూమా కుటుంబం మ‌రో వైపు.. టీజీ వెంక‌టేశ్‌.. స‌హా ప‌లువురు.. పార్టీని అన్ని విధాలా కాపాడుకున్నారు.కానీ, త‌ర్వాత కాలంలో వ‌చ్చిన మార్పుల‌తో ఎవ‌రికివారుగా పార్టీకి దూర‌మై.. మ‌ళ్లీ ద‌గ్గ‌రైన ప‌రిణామాల‌తో ఇప్పుడు టీడీపీకి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇక‌, ఆది నుంచి కూడా కాంగ్రెస్ హ‌వా ఎక్కువ‌గా ఉన్న ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితిమ‌రింత దారుణంగా త‌యారైంది. ఇక్క‌డ టీడీపీ ఆవిర్భా వం త‌ర్వాత‌.. 1994లో ఒక‌సారి విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీ

త‌ర్వాత ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకున్న‌ది లేదు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవ‌డంలో నాయ‌కులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. కోట్ల కుటుంబం రాజ‌కీయాల నేప‌థ్యంలో ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లోపేత‌మైంది. తొలినాళ్ల‌లో బాగానే పుంజుకుంటుంద‌న్న ద‌శ‌లో ఉన్న టీడీపీ.. త‌ర్వాత చ‌తికిల ప‌డింది. దీంతో 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ పొత్తులో భాగంగా.. సీపీఐకి ఈ టికెట్ కేటాయించింది. ఇది మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా పార్టీ పుంజుకోలేదు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన కోట్ల సుజాత‌మ్మకు టికెట్ కేటాయించారు. అయితే.. ఆమె కూడా విఫ‌ల‌మ‌య్యారు. వ‌రుస విజ‌యాల‌తో వైసీపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోను, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలోనూ వైసీపీ స‌క్సెస్ అయింది. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా గుమ్మ‌నూరు జ‌య‌రామ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేబినెట్‌లోనూ ఆయ‌న స్థానం ద‌క్కించుకున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఆయ‌న‌పై ఒకింత వ్యతిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఇప్పుడైనా.. టీడీపీ పుంజుకుని.. ఈ వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం మ‌రింత దారుణంగా ఉంది. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా సుజాత‌మ్మ‌నే కొన‌సాగిస్తారా?  లేక మారుస్తారా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ఆమెనే తిరిగి కొన‌సాగిస్తే.. మ‌రింత‌గా టీడీపీ ఇబ్బంది క‌ర ప‌రిస్థితిలోకి జారుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



ఏపీలో ఉద్యోగాలివ్వ‌నున్న జ‌న‌సేన‌?

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

వివాదాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో

ఆలూరులో చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిరి అవుతున్నాయిగా ?

సజ్జల తీరుపై మంత్రుల గుర్రు!

మరో విజయసాయిరెడ్డిలా రేవంత్

ప‌వ‌న్‌తో సంబంధం లేకుండా జ‌న‌సైనికుల రాజ‌కీయం ?

కేరళలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>