PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rtc-offer-for-home-changersab23de3d-c7d2-46fb-9070-a272ced9ab91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rtc-offer-for-home-changersab23de3d-c7d2-46fb-9070-a272ced9ab91-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రజలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ప ప్రకటించింది. ఇల్లు మారే వారే కాదు.. గృహోపకరణాలు.. పరిశ్రమలకు సంబంధించిన వస్తువులను దూరప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్టీసీ కార్గోసేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతవరకు తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఈ సేవలు.. ఇతర రాష్ట్రాలకు కూడా చేరవేసేందుకు సిద్ధమైంది. tsrtc cargo services{#}vehicles;Tuni;Hyderabad;Shamshabad;RTC;House;Telanganaఇల్లు మారేవారికి ఆర్టీసీ ఆఫర్..!ఇల్లు మారేవారికి ఆర్టీసీ ఆఫర్..!tsrtc cargo services{#}vehicles;Tuni;Hyderabad;Shamshabad;RTC;House;TelanganaFri, 16 Jul 2021 11:46:59 GMTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇల్లు మారాలనుకుంటున్న వారికి కార్గో సేవలను అందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇంటి సామాగ్రిని.. వినియోగదారులు కోరుకున్న ప్రాంతాలకు రవాణా చేయనుంది. సామాగ్రి, దూరం ఆధారంగా ధరను నిర్ణయిస్తారు. ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం అన్ని రకాల సర్వీసులు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కార్గో అధికారులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉన్న పోటీలో తట్టుకోవడానికి కొత్త విధానాలు తీసుకొస్తున్నామన్నారు.

మరోవైపు తొలిసారిగా టీఎస్ఆర్టీసీ విశాఖపట్టణం వరకు తమ సేవలను విస్తరించింది. శంషాబాద్ నుంచి నేరుగా కార్గో వాహనం విశాఖకు వెళ్లింది. హైదరాబా నుంచి విశాఖకు బయల్దేరే కార్గో వాహనాలకు కొన్ని కనెక్టెడ్ పాయింట్లు కూడా ఉన్నాయి. సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని నుంచి పయనించి  చివరకు విశాఖకు చేరుకుంటాయి. అయితే ఈ కార్గొవాహనాలు హైదరాబాద్ లోని సీబీఎస్, లక్డీకపూల్, మెహిదీపట్నం, పటాన్ చెరులలో వినియోగదారులకు అందుబాటు ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ లో ఉండే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు కార్గో సర్వీసులను ఆశ్రయించవచ్చని చెబుతున్నారు.

ఈ కార్గో వాహనాలు 10టన్నుల సామర్థ్యాన్ని కలిగిఉంటాయి. అయితే టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గోసేవల ఛార్జీలు వినియోగదారులకు సరసమైన ధరల్లోనే ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ధరలతో పోలిస్తే ఆర్టీసీ అందిస్తున్న సేవలు చాలా తక్కువని అంటున్నారు. కాబట్టి ఈ కార్గో సేవలను నగర వాసులు వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఈ కార్గో వాహనాల్లో ఇంట్లోని వస్తువులే కాదు.. ఇళ్లు కట్టేందుకు ఉపయోగించే వస్తువులు.. కంపెనీకి సంబంధించిన వస్తువులు.. గృహోపకరణాలను కూడా తరలించనున్నారు. వినియోగదారులు అనుకున్న సమయానికి చేరవేయనున్నాయి. ఇంతవరకు తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఈ సేవలు.. ఇతర రాష్ట్రాలకు కూడా చేరవేసేందుకు సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. ఇంతవరకు తెలంగాణ ప్రాంతంలో కూరగాయలు.. ఇతర సరుకులనే రవాణా చేసేవారు. తాజాగా టీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఊరట కలిగిస్తోంది.







 



ఫ్రెండ్సే క‌దా అని ఫోన్ ఇస్తే.. !

ఆ మంత్రి ఆ కలెక్టర్ రహస్య బేటి దేనికో మరీ..?

ఆ ఊర్లో స‌మాదులే సిగ్న‌ల్ స్పాట్ లు.. !

‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

కేసీఆర్ స‌మ‌క్షంలో నేడు కారెక్క‌నున్న ర‌మ‌ణ‌.. !

ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్

చైతూ, సమంతల లవ్ పై నాగార్జున సీక్రెట్ ఏజెంట్స్ వీరే..

యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>