Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr78626c70-9d7a-4ace-bc78-ca82073a2766-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr78626c70-9d7a-4ace-bc78-ca82073a2766-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలలో ఈటెల అంశం ఇంకా చల్లబడలేదు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వెళ్లడంతో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే మొన్నటి వరకు అధికార పార్టీ అగ్రనేతలు అందరూ ప్రతిపక్షాల విమర్శలు పైనే మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. కానీ ఇప్పుడు ఒక్కసారి అగ్రనేతల చేతికి మైక్ వచ్చిందంటే చాలు మిగతా అన్ని వదిలేసి ఈటెల వ్యవహారాన్ని తెరమీదికి తెస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడాKcr{#}Eatala Rajendar;Onamalu;రాజీనామా;MLA;Telangana Rashtra Samithi TRS;Telangana;Party;CM;Minister;Governmentఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్Kcr{#}Eatala Rajendar;Onamalu;రాజీనామా;MLA;Telangana Rashtra Samithi TRS;Telangana;Party;CM;Minister;GovernmentFri, 16 Jul 2021 10:15:00 GMTతెలంగాణ రాజకీయాలలో ఈటెల అంశం ఇంకా చల్లబడలేదు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వెళ్లడంతో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే మొన్నటి వరకు అధికార పార్టీ అగ్రనేతలు అందరూ ప్రతిపక్షాల విమర్శలు పైనే మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు.  కానీ ఇప్పుడు ఒక్కసారి అగ్రనేతల చేతికి మైక్ వచ్చిందంటే చాలు మిగతా అన్ని వదిలేసి ఈటెల వ్యవహారాన్ని తెరమీదికి తెస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా విమర్శనాస్త్రాలు గురి పెడుతున్నారు.



 ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుని నమ్మక ద్రోహం చేశారని..  ఈటల తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని..  ఈటల వెళ్లిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టం ఏమీ లేదు టీఆర్ఎస్ కీలక నేతలు మంత్రులు ఇక ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవలే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సైతం ఈటెల వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చి విమర్శలు చేశారు. ఈటెల రాజేందర్ కు టిఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అంటూ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.  ఇటీవలే ఓ సమావేశానికి హాజరైన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.



 సీఎం కేసీఆర్ ఈటల రాజకీయ జీవితానికి పురుడు పోసి అన్నం పెట్టి ఓనమాలు నేర్పిస్తే ఈటల రాజేందర్ మాత్రం కెసిఆర్ బతికుండగానే సీఎం కుర్చీలో కూర్చోవాలని  ఆశపడ్డాడు మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఈటల రాజేందర్ కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోలేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు.  ఈటెల ఎన్నోసార్లు ప్రభుత్వ పథకాలు దండగ అని మాట్లాడారని చెప్పుకొచ్చారు హరీష్ రావు. అయితే ఇలా ఈటల మాట్లాడిన మాటలు కెసిఆర్ గుండెకు ఎంత గాయం చేశాయో ఈటెల అర్థం చేసుకోవాలని  మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.



బొమ్మలేస్తు ప్రపంచ ప్రఖ్యాతి గావిస్తున్న తెలుగు మహిళ

సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్...వీటి పైనే చర్చ.. !

గుడ్‌ న్యూస్ చెప్పిన జగన్.. ప్రభుత్వోద్యోగులకు మాత్రమే..!

చైనా సహకరించాల్సిందే: WHO

యూపీలో మారుతున్న రాజకీయాలు

గుట్కా మంత్రులకు ఈటల పరిస్థితి రానుందా..?

రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ

జాబ్ క్యాలెండర్.. జగన్ కంటే కేసీఆర్ కే ఎక్కువ సమస్యలు..

'గాంధీ' కుటుంబాన్ని వీడనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>