SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup4fc31dcc-594c-4569-b9af-db1c5e2d8044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup4fc31dcc-594c-4569-b9af-db1c5e2d8044-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులకు మరోసారి దాయాదుల సమరం కనుల విందు కానుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు క్రికెట్ ఆడినా సరే... ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాతే. అవును... ఏ మ్యాచ్ కు రానంత క్రేజ్ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కు వస్తుంది. అసలు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు వికెట్ పడితే చాలు... యుద్ధంలో శత్రువు చచ్చినట్లు సంబరాలు.. ఇక మ్యాచ్ గెలిస్తే... యుద్ధం గెలిచినట్లే. అంతటి క్రేజ్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉంది. Icc T20{#}Pakistan;Cricket;war;Namibia;Oman;West Indies;ICC T20;November;October;Indiaవరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో తలపడనున్న భారత్వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో తలపడనున్న భారత్Icc T20{#}Pakistan;Cricket;war;Namibia;Oman;West Indies;ICC T20;November;October;IndiaFri, 16 Jul 2021 17:15:09 GMTక్రికెట్ అభిమానులకు మరోసారి దాయాదుల సమరం కనుల విందు కానుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు క్రికెట్ ఆడినా సరే... ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాతే. అవును... ఏ మ్యాచ్ కు రానంత క్రేజ్ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కు వస్తుంది. అసలు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు వికెట్ పడితే చాలు... యుద్ధంలో శత్రువు చచ్చినట్లు సంబరాలు.. ఇక మ్యాచ్ గెలిస్తే... యుద్ధం గెలిచినట్లే. అంతటి క్రేజ్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉంది.

ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ గ్రూప్ లను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో ఒకే గ్రూప్ లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్టు ఉండగా... గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆఫ్గానిస్తాన్ జట్టు ఉన్నాయి. గ్రూప్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉండగా.... గ్రూప్ బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పవువా న్యూగినియా, ఒమన్ దేశాలున్నాయి. గ్రూప్ ఏ విజేత, గ్రూప్ బి రన్నరప్ గ్రూప్ 1లో ఆడతాయి. గ్రూప్ బి విజేత, గ్రూప్ ఏ రన్నరప్ గ్రూప్ 2లో ఆడతాయి.

లీగ్ దశలోనే ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఐసీసీ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు జరిగిన్న అన్నిమ్యాచ్ ల్లో కూడా భారత్ జట్టుదే విజయం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్... లో కూడా టీమిండియా సూపర్ విక్టరీలు సాధించింది. ఒక్కసారి కూడా భారత్ పై పాకిస్తాన్ గెలవలేకపోయింది. ఈ సారి లీగ్ దశలోనే దాయాదుల పోటీ ఉండటంతో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి అబుదాబిలోని దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టోర్ని జరగనుంది. నవంబర్ 14న టైటిల్ పోరు జరగనుంది. మరి ఈ సారి గెలుపెవరిదో చూడాలి మరి.



గెజిట్ నోటిఫికేషన్ పై కేంద్రం క్లారిటీ

ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?

తగ్గేదే లే... యష్ కూడా స్టార్ట్ చేశాడు !

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దీన్నీ వదలరా!!

విజయ్ దేవరకొండ చెప్పి మరీ కొడుతున్నాడు గా!!

కియారా అద్వానికి పోటీ వస్తున్న అలియా..!

ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన కొత్త ఫీచర్ ?

బాబుని ముఖ్య‌మంత్రి చేయ‌డానికి ఎవ‌రైనా ఎదిరిస్తా...!

ఆఫ్ఘన్‌లో ఇండియ‌న్‌ ఫోటో జ‌ర్న‌లిస్ట్ హ‌త్య‌...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>