MoviesN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-ex-mla-updates-in-ycpdd0ad6db-235c-4e7f-86ca-717420688f25-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జ‌రిగింది. మంగ‌ళ‌గిరి టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో అధినేత చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి తీర్మాణాలు చేశారు.రాష్ట్రంలో ప్ర‌ధానంగా రైతుల‌కు ధాన్యం బ‌కాయిలు ఇంకా చెల్లించ‌క‌పోవ‌డంపై పొలిట్‌బ్యూరోలో చ‌ర్చ జ‌రిగింది.దీనిపై పోరాడ‌ల‌ని అధినేత చంద్ర‌బాబు నేత‌ల‌కు సూచించారు. ఇటు పండిచిన పంట‌ల‌కు సైతం గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌క‌పోవ‌డం,అంత‌రాష్ట్ర జ‌ల వివాదం,పోల‌tdp;{#}Vishakapatnam;Telugu Desam Party;TDP;Partyటీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ... ఎజెండా ఇదే...?టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ... ఎజెండా ఇదే...?tdp;{#}Vishakapatnam;Telugu Desam Party;TDP;PartyThu, 15 Jul 2021 13:22:05 GMTప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో  సమావేశం జ‌రిగింది. మంగ‌ళ‌గిరి టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో  టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి తీర్మాణాలు చేశారు.రాష్ట్రంలో ప్ర‌ధానంగా రైతుల‌కు ధాన్యం బ‌కాయిలు ఇంకా చెల్లించ‌క‌పోవ‌డంపై పొలిట్‌బ్యూరోలో చ‌ర్చ జ‌రిగింది.దీనిపై పోరాడ‌ల‌ని అధినేత చంద్ర‌బాబు నేత‌ల‌కు సూచించారు. ఇటు పండిచిన పంట‌ల‌కు సైతం గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌క‌పోవ‌డం,అంత‌రాష్ట్ర జ‌ల వివాదం,పోల‌వ‌రం నిర్వాసితుల‌కు పున‌రావాసంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.

రాష్ట్రంలో క‌రోనా మ‌హామ్మారి చాలా కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేసింది.అయితే రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లింపులో ప్ర‌భుత్వం జాప్యం చేయ‌డంపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని టీడీపీ ఆందోళ‌న చేసిన విష‌యాన్ని నేత‌లు ప్ర‌స్తావించారు. స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు ఆందోళ‌న చేయాల‌ని అధినేత సూచించారు. విశాఖ ఉక్కు ప్ర‌వేటీక‌ర‌ణ‌,నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెంపు, ఖ‌నిజ దోపిడి,చెత్త ప‌న్న త‌దిత‌ర అంశాల‌పై పొలిట్‌బ్యూరోలో చ‌ర్చించారు.రేప‌టి నుంచి జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.రాష్ట్రానికి రావాల్సిన నిధులు,విభ‌జ‌న హామీల అమ‌లు, పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల‌ను ఎంపీల‌తో అధినేత చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై టీడీపీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆందోళ‌న చేస్తుంది.ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌లో ఇచ్చిన హ‌మీల‌ను అమ‌లు చేయక‌పోవ‌డంపై టీడీపీ ఫోక‌స్ పెట్టింది. ఇచ్చిన హ‌మీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం,సంక్షేమ ప‌థ‌కాల్లో ల‌బ్ధిదారుల‌ను కోత విధించ‌డం లాంటి చ‌ర్య‌లను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది.ప్ర‌తి ఏటా పెన్ష‌న్ 250 రూపాయ‌లు పెంచుతాన‌ని చెప్పిన హామీ మాట‌ల‌కే ప‌రిమితం అయింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్ని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లిపోతున్నాయని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.



జగన్ వ్యూహం ఏంటో...? ఎంపీలకు ఏం చెప్తారో...?

జగన్ బెయిల్ రద్దు: సీబీఐపై ఒత్తిడి ఫలించేనా ?

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో స‌మావేశం. చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో సమావేశం.

డైల‌మాలో కౌశిక్‌రెడ్డి.. ష‌ర్మిల పార్టీ వైపు చూస్తున్నాడా..?

మంత్రి తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి.. !

హుజురాబాద్ లో "రాజీ"కీయం నడుస్తుందా..?

చంద్రబాబును చిరాకు పెడుతున్న జూ. ఎన్టీఆర్‌..?

ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా మన "లీడర్"



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>