MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulia5696536-e67f-4c4b-a64b-233e344182cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulia5696536-e67f-4c4b-a64b-233e344182cc-415x250-IndiaHerald.jpgఎంత పేరున్న దర్శకుడు అయినప్పటికీ టాప్ హీరోలతో మల్టీ స్టారర్స్ తీయడం అంత సులువైన పనికాదు. అక్కినేని నందమూరి లతో పూర్వకాలం శోభన్ బాబు కృష్ణ లతో మధ్య కాలంలో అనేక మల్టీ స్టారర్ మూవీలు వచ్చినప్పటికీ ఆరోజులలో సోషల్ మీడియా లేకపోవడంతో హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం ఉండేది కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. సోషల్ మీడియాలో అభిమానులు టాప్ హీరోలకు ఆర్మీగా ఏర్పడి వారి పై చిన్న నెగిటివ్ కామెంట్ రాకుండా అడ్డుకట్ట వేస్తూ ఎదుటి హీరో పై మాటల దాడి చేస్తున్నారు.ఈమాటల దాడి ఒకొక్కసారి అదుపు తప్పి అశ్లీల పదాలతో కూడrajamouli{#}Ram Charan Teja;Alia Bhatt;Jr NTR;Rajamouli;sobhan babu;media;Industry;war;Darsakudu;Hero;Director;Newsచరణ్ జూనియర్ లను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి అనుసరిస్తున్న టెక్నిక్ !చరణ్ జూనియర్ లను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి అనుసరిస్తున్న టెక్నిక్ !rajamouli{#}Ram Charan Teja;Alia Bhatt;Jr NTR;Rajamouli;sobhan babu;media;Industry;war;Darsakudu;Hero;Director;NewsThu, 15 Jul 2021 08:00:00 GMTఎంత పేరున్న దర్శకుడు అయినప్పటికీ టాప్ హీరోలతో మల్టీ స్టారర్స్ తీయడం అంత సులువైన పనికాదు. అక్కినేని నందమూరి లతో పూర్వకాలం శోభన్ బాబు కృష్ణ లతో మధ్య కాలంలో అనేక మల్టీ స్టారర్ మూవీలు వచ్చినప్పటికీ ఆరోజులలో సోషల్ మీడియా లేకపోవడంతో హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం ఉండేది కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. సోషల్ మీడియాలో అభిమానులు టాప్ హీరోలకు ఆర్మీగా ఏర్పడి వారి పై చిన్న నెగిటివ్ కామెంట్ రాకుండా అడ్డుకట్ట వేస్తూ ఎదుటి హీరో పై మాటల దాడి చేస్తున్నారు.


ఈమాటల దాడి ఒకొక్కసారి అదుపు తప్పి అశ్లీల పదాలతో కూడిన బూతు పురాణానికి దారి తీస్తోంది. చరణ్ జూనియర్ లతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్న రాజమౌళి తన సినిమాలో వీరిద్దరికీ ఎలా సీన్స్ బ్యాలెన్స్ చేసాడు అన్నవిషయమై ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆశక్తి పెరిగి పోతోంది. దీనికితోడు ఈ సీన్స్ బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా అటు తారక్ అభిమానుల నుండి ఇటు చరణ్ అభిమానుల నుండి తీవ్ర అసహనాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఈమూవీకి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఈసీన్స్ బ్యాలెన్స్ చేయడంలో ఒక తెలివైన పద్ధతి అనుసరించినట్లు టాక్.


ఈసినిమాకు సంబంధించిన సీన్స్ డైలాగ్స్ విషయంలో జూనియర్ కు అదనంగా కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ పడినట్లు తెలుస్తోంది. దీనికి చరణ్ అభిమానులు హర్ట్ కాకుండా పాటల విషయంలో చరణ్ పాత్రకు సంబంధించి చాలమంచి పాటలతో పాటు చాల ఖరీదైన సెట్స్ లోకేషన్స్ లో చరణ్ కు సంబంధించిన ఒక పాటను చిత్రీకరించి జూనియర్ చరణ్ ల మధ్య ఈసినిమాకు సంబంధించి అన్ని విషయాలలోనూ సమన్యాయం చూపినట్లు వార్తలు వస్తున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి 2 పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిన పరిస్థితులలో ఇప్పుడు ఈరెండు పాటలలోని ఒక పాట హాట్ టాపిక్ గా మారింది. చరణ్ అలియా భట్ లపై తీయబోతున్న పాట భారతీయ సినీచరిత్రలోనే ఖరీదైన పాటగా రికార్డు సృష్టించబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈపాట షూటింగ్ కోసం యూనిట్ అందర్నీ కలుపుకుని జక్కన్న యూరప్ వెళ్ళబోతున్నారు. ఈపాట  షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు అలియాభట్ ఒలీవియా మోర్స్ కూడా పాల్గొంటుంది అన్న లీకులు వస్తున్నాయి. ఇక ఈరోజు ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్న రోర్ ఆఫ్ ‘ఆర్ ఆర్ ఆర్’ పేరిట విడుదల చేసే వీడియో గురించి అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..






రేవంత్ ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి టిఆర్ఎస్ మాజీ మంత్రి ?

పీలేరులో భూదందా రచ్చ!

"వేదం" తెలిపిన సారమిదే !

తెలంగాణ బీజేపీకీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా...?

మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!

ఆర్టీసీతో గూగుల్ టైఅప్.. ఇక నో టెన్షన్!

హిట్ ఇచ్చిన హీరోను తప్పిస్తే ఎలా..?

యువ హీరో సినిమాకి నో చెప్పిన అనుష్క..!?

ఆడవి శేష్ ఎఫైర్ పెట్టుకుంది ఎవరితోని తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>