MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/best-inspirational-movies88e7a45e-80a8-470b-a901-091f27d2bed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/best-inspirational-movies88e7a45e-80a8-470b-a901-091f27d2bed2-415x250-IndiaHerald.jpg1987లో విడుదలైన స్వయంకృషి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ అద్భుతంగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించారు. ఈ చిత్రంలో కథానాయకుడి జీవిత ప్రస్థానం చెప్పులు కుట్టే వ్యక్తిగా మొదలవుతుంది. కథానాయకుడు చదువు రాక చేసేదేమీ లేక చెప్పులు కుట్టడం వృత్తిగా ఎంచుకుని.. రేయింబవళ్ళు శ్రమించి కోట్ల రూపాయలు సంపాదించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. కృషివుంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని దృశ్యకావ్యంగా చూపించిన స్వయంకృషి సBest-inspirational-movies{#}jeevitha rajaseskhar;Moscow;workers;Eluru;Sirivennela Sitaramasastri;Andhra Pradesh;Fidaa;NTR Kathanayakudu;Chiranjeevi;Cinemaచిరంజీవి చేసిన బెస్ట్ మోటివేషనల్ సినిమా ఇదే..!చిరంజీవి చేసిన బెస్ట్ మోటివేషనల్ సినిమా ఇదే..!Best-inspirational-movies{#}jeevitha rajaseskhar;Moscow;workers;Eluru;Sirivennela Sitaramasastri;Andhra Pradesh;Fidaa;NTR Kathanayakudu;Chiranjeevi;CinemaThu, 15 Jul 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ అద్భుతంగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించారు. ఈ చిత్రంలో కథానాయకుడి జీవిత ప్రస్థానం చెప్పులు కుట్టే వ్యక్తిగా మొదలవుతుంది. కథానాయకుడు చదువు రాక చేసేదేమీ లేక చెప్పులు కుట్టడం వృత్తిగా ఎంచుకుని.. రేయింబవళ్ళు శ్రమించి కోట్ల రూపాయలు సంపాదించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. కృషివుంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని దృశ్యకావ్యంగా చూపించిన స్వయంకృషి సినిమా తెలుగులో వచ్చిన బెస్ట్ ఇన్‌స్పిరేషనల్ సినిమా అని చెప్పుకోవచ్చు.

నిజానికి చిరంజీవి తన కెరీర్ లో చేసిన మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ సినిమా స్వయంకృషి. తన స్టార్ డమ్ పక్కనపెట్టి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి గా అవతారం ఎత్తి.. సహజ నటనతో అలరించి చిరంజీవి అందరినీ ఫిదా చేశారు. అందుకే ఆయనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా లభించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది కార్మికులు ఎంతో ఆత్మ విశ్వాసంతో పనిచేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే ఒక వ్యక్తి తన షాప్ కి "స్వయంకృషి" అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా ప్రజలపై ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

కె.విశ్వనాథ్ ఈ సినిమాకి కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలకు సింగిరెడ్డి నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. రమేష్ నాయుడు అద్భుతంగా పాటలను స్వరపరిచారు. సిగ్గు పూబంతి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాలోని అన్ని పాటలు కూడా కథకు తగ్గట్లుగా ఉండి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమా ద్వారా విదేశీయులు కూడా స్పూర్తి పొందారు. స్వయంకృషి సినిమాని రష్యాలో అనువదించి మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు.


తన సినిమాకి తానే గెస్ట్ గా రాజమౌళి?

పాన్ ఇండియా కాదు.. మహేష్ పక్కా లోకల్..!

పవన్ సినీ జీవితంలో తమ్ముడు సినిమా కీలక మలుపు..!!

ప్రతి ఒక్కరిని కలిగించే సినిమా.. శ్రీ హరి భద్రాచలం మూవీ..!!

హాట్ టాపిక్ గా మారిన ఆర్ నారాయణమూర్తి ఆర్ధిక బాధలు !

"రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్" : మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ ?

ఎప్ప‌టికీ గుర్తుండిపోయే `స్వ‌యం కృషి`..!

R.నారాయణమూర్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా..?

బ్రేకింగ్ : టీమ్ ఇండియా క్రికెటర్ కు కరోనా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>