MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vikram-vedha-remake-updatesad767b01-3632-4212-8974-0a981403a016-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vikram-vedha-remake-updatesad767b01-3632-4212-8974-0a981403a016-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో బాగా హిట్ అయిన సినిమాను ఒకభాష నుండి వేరే భాషలోకి రీమేక్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది వరకు ఈ విధంగా చాలా సినిమాలు రీమేక్ లు గా వచ్చి ప్రేక్షకులను రెండు భాషల్లోనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో తమిళ్ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" రీమేక్ కానుంది.VIKRAM VEDHA REMAKE UPDATES{#}Hrithik Roshan;Saif Ali Khan;ajith kumar;Box office;Ajit Pawar;Success;Madhavan;Radhika Aapte;vikram;vijay sethupathi;Remake;Tamil;bollywood;Hero;Cinema"విక్రమ్ - వేద" రీమేక్ లో స్టార్ హీరో ?"విక్రమ్ - వేద" రీమేక్ లో స్టార్ హీరో ?VIKRAM VEDHA REMAKE UPDATES{#}Hrithik Roshan;Saif Ali Khan;ajith kumar;Box office;Ajit Pawar;Success;Madhavan;Radhika Aapte;vikram;vijay sethupathi;Remake;Tamil;bollywood;Hero;CinemaThu, 15 Jul 2021 12:00:00 GMTసినిమా పరిశ్రమలో బాగా హిట్ అయిన సినిమాను ఒకభాష నుండి వేరే భాషలోకి రీమేక్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది వరకు ఈ విధంగా చాలా సినిమాలు రీమేక్ లు గా వచ్చి ప్రేక్షకులను రెండు భాషల్లోనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో తమిళ్ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" రీమేక్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. తమిళ మాతృకలో ప్రధాన పాత్రల్లో మాధవన్ మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. ఇద్దరూ పోటీ పడి నటించి సినిమా అఖండ విజయాన్ని సాధించడంలో పాలుపంచుకున్నారు. ఈ సినిమా 2017 లోనే విడుదల కాగా, నాలుగు సంవత్సరాల తర్వాత రీమేక్ చేస్తుండడం విశేషం.
ఇందులో సైఫ్ అలీ ఖాన్ మరియు హృతిక్ రోషన్ లు నటించనున్నారు. ఈ సినిమాలో సైఫ్ భార్యగా మరియు హృతిక్ కు లాయర్ గా రాధికా ఆప్టే నటించబోతున్నట్లు అధికారిక సమాచారం. తమిళ్ లో తీసిన పుష్కర్ గాయత్రి లే రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ గాసిప్ బాలీవుడ్ వర్గాల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేందుకు ఒక పాత్రను సృష్టించనున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి.
 ప్రస్తుతానికయితే ఈ వార్త అజిత్ అభిమానులను హుషారులో ముంచెత్తుతోంది. కానీ ఫిలిం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది ఒక గాసిప్ లాగ మిగిలిపోనుంది. ఇది కనుక నిజమయితే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్ని సార్లు రీమేక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. మరి విక్రమ్ వేద సక్సెస్ అవుతుందా చూడాలి. కాగా ఈ సినిమాను షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యి, వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  




PK సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

స్టైల్ మార్చిన జక్కన్న... ముందే మొత్తం లీక్

వామ్మో మెగా డాటర్ కు ఈ అలవాటు కూడా ఉందా.. ?

ఈ దెబ్బకు జక్కన్న ఆ రిమార్క్ కడిగేస్తాడా...?

బాహుబలిని మర్చిపోవడమే, ఆ సీన్ లు అలానే ఉన్నాయి మరి...?

జక్కన్న... నువ్వు మాస్టర్ మైండ్ అంతే...?

సినిమా పరిశ్రమలో బాగా హిట్ అయిన సినిమాను ఒకభాష నుండి వేరే భాషలోకి రీమేక్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది వరకు ఈ విధంగా చాలా సినిమాలు రీమేక్ లు గా వచ్చి ప్రేక్షకులను రెండు భాషల్లోనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో తమిళ్ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" రీమేక్ కానుంది.

రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వచ్చేసింది.. !

అడవులకు నిప్పు పెట్టేసిన రాజమౌళి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>