Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-new-movie-first-look-released90b68f9a-dd68-4f6a-8f9d-004fc548dc2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-new-movie-first-look-released90b68f9a-dd68-4f6a-8f9d-004fc548dc2f-415x250-IndiaHerald.jpgయువ హీరోల్లో టాలెంట్ ఫుల్లుగా ఉన్న శర్వానంద్ సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవట్లేదని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన శ్రీకారం మంచి మెసేజ్ తో వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వరుస అపజయాలు శర్వానంద్ ను మరింత జాగ్రత్త పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం మూవీ చేస్తున్న శర్వానంద్ ఈ సినిమా అవుట్ పుట్ Sharwanand{#}Amala Akkineni;kishore;Genre;sree;ajay;rashmika mandanna;Maha;Kannada;Posters;Ram Gopal Varma;Romantic;Cinemaశర్వానంద్ ఈసారి రెండిటితో గురి పెట్టాడు..!శర్వానంద్ ఈసారి రెండిటితో గురి పెట్టాడు..!Sharwanand{#}Amala Akkineni;kishore;Genre;sree;ajay;rashmika mandanna;Maha;Kannada;Posters;Ram Gopal Varma;Romantic;CinemaThu, 15 Jul 2021 23:00:00 GMTయువ హీరోల్లో టాలెంట్ ఫుల్లుగా ఉన్న శర్వానంద్ సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవట్లేదని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన శ్రీకారం మంచి మెసేజ్ తో వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వరుస అపజయాలు శర్వానంద్ ను మరింత జాగ్రత్త పడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం మూవీ చేస్తున్న శర్వానంద్ ఈ సినిమా అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటుగా శ్రీ కార్తిక్ డైరక్షన్ లో ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజైంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై కూడా శర్వానంద్ పూర్తి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. ఒకే ఒక జీవితం స్నీక్ పీక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా అక్కినేని అమల హీరో మదర్ పాత్రలో నటిస్తుంది.

ఈ రెండు సినిమాలు హిట్ టార్గెట్ తో వస్తున్నాడు శర్వానంద్. రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడం విశేషం. ఇక ఈ రెండిటితో పాటుగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ తో కెరియర్ సూపర్ ఫాం లో ఉన్న కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి ఫుల్ లైనప్ సినిమాలతో శర్వానంద్ కెరియర్ బిజీగా ఉండగా ఈ 3 సినిమాల మీద ఫుల్ ఫోకస్ తో ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమాలతో శర్వానంద్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటాడని అంటున్నారు. సినిమాలైతే క్రేజీగా ఉన్నా శర్వానంద్ ఈసారైన ప్రేక్షకులను అలరించేలా చేస్తాడో లేదా అన్నది చూడాలి.




ఉదయాన్నే మంచు లక్ష్మికి షాక్..!

శర్వానంద్ ఈసారి రెండిటితో గురి పెట్టాడు.మహా సముద్రం, ఒకే ఒక జీవితం సినిమాలతో హిట్ టార్గెట్ పెట్టిన శర్వా.

హమ్మయ్య.. 'RRR' వల్ల ఆ సినిమాలకు ఎలాంటి నష్టం లేదట..!!

ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియో.. వాటిని రివీల్ చేయని జక్కన్న..!

అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

కొంపమునిగింది.. అయ్యో..!

బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>