Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rrr0570908f-56b8-4add-b072-96c6016e6755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rrr0570908f-56b8-4add-b072-96c6016e6755-415x250-IndiaHerald.jpgఅందరు సినిమాలు తీస్తారు.. కాని తీసే సినిమాలు అద్భుతాలు సృష్టించేలా చేసే దర్శకులు మాత్రం కొంతమందే ఉంటారు. ఎంచుకున్న కథ తెరరూపం దాల్చే వరకు ప్రతి సెకన్ సినిమా తప్ప మరేమి ఆలోచించరు. అలాంటి చాలా తక్కువమందిలో చాలా ప్రత్యేకమైన దర్శకుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ప్రతి సన్నివేశం సినిమాకు ముఖ్యమే అందుకే ఏది లైట్ తీసుకోకూడదు అన్నది ఆయన ఫార్ములా. Rajamouli-RRR{#}Student No 1;Bahubali;Komaram Bheem;Rajamouli;Raccha;RRR Movie;Jr NTR;Darsakudu;Telugu;Director;Cinemaఅంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు..!అంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు..!Rajamouli-RRR{#}Student No 1;Bahubali;Komaram Bheem;Rajamouli;Raccha;RRR Movie;Jr NTR;Darsakudu;Telugu;Director;CinemaThu, 15 Jul 2021 17:00:00 GMTఅందరు సినిమాలు తీస్తారు.. కాని తీసే సినిమాలు అద్భుతాలు సృష్టించేలా చేసే దర్శకులు మాత్రం కొంతమందే ఉంటారు. ఎంచుకున్న కథ తెరరూపం దాల్చే వరకు ప్రతి సెకన్ సినిమా తప్ప మరేమి ఆలోచించరు. అలాంటి చాలా తక్కువమందిలో చాలా ప్రత్యేకమైన దర్శకుడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ప్రతి సన్నివేశం సినిమాకు ముఖ్యమే అందుకే ఏది లైట్ తీసుకోకూడదు అన్నది ఆయన ఫార్ములా. అందుకే స్టూడెంట్ నెంబర్ 1 నుండి రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి సినిమా అంటే తారాస్థాయి అంచనాలు ఉంటాయి.

రాజమౌళి సినిమా తీస్తే పక్కా హిట్ దానిలో ఏమాత్రం తిరుగు ఉండదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచి.. తెలుగ్ సినిమా స్టామినా ప్రూవ్ చేసిన దర్శకుడు జక్కన్న. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరో అద్భుతం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో ఇద్దరు సూపర్ హీరోస్ నటించడం ప్రధాన హైలెట్. ఇక సినిమాకు సంబందించిన కథ.. వచ్చిన టీజర్లు అంచనాలు డబుల్ ట్రిపుల్ చేశాయి. లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ నుండి వచ్చిన మేకింగ్ వీడియో మరింత అంచనాలు పెంచింది. రాజమౌళి సినిమా అంటే ఇలానే ఉంటాయని మరోసారి మేకింగ్ వీడియోతోనే శభాష్ అనిపించేశాడు.

అంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎలా అవుతాడు చెప్పండి. అసలే ఫ్రీడం ఫైటర్స్ కథ.. సినిమాలో ఎన్ని రోమాలు నిక్కబొడుకునే సన్నివేశాలు.. హృదయాన్ని కదిలించే సందర్భాలు.. తొడ కొట్టి మీసం తిప్పే ఉత్సాహాలు ఇవన్ని ఆర్.ఆర్.ఆర్ లో ఉంటాయని జస్ట్ మేకింగ్ లోనే చూపించాడు రాజమౌళి. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడటానికి సిద్ధంగా ఉన్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఆర్.ఆర్.ఆర్ మరోసారి నేషనల్ వైడ్ గా రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో రామరాజుగా చరణ్.. కొమరం భీం పాత్రలో తారక్ దుమ్ముదులిపేస్తారని మాత్రం అర్ధమవుతుంది.





టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

రకుల్ కట్టిన చీర రేట్ ఎంతో తెలిస్తే చుక్కలే

హీరోలు ఆటగాళ్లైతే..! మరి సినిమాలు..?

తాడేపల్లిలో ఏం జరుగుతోంది..?

హీరో తరుణ్ గురించి తల్లి బయటపెట్టిన సీక్రెట్

సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన స్టార్స్ ఎందరో..

వెంకటేష్ నటించిన శీను మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?

నిర్మాతగా మారిన ప్రముఖ డైరెక్టర్ కుమార్తె..?

రాజమౌళి తో ప్రయోగానికి సిద్ధమైన బెల్లం కొండ శ్రీనివాస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>