PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla-car99c3a57a-65e9-4e8e-892f-5932ae7b83d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla-car99c3a57a-65e9-4e8e-892f-5932ae7b83d9-415x250-IndiaHerald.jpgఈ కుండపోత వర్షాలకు నగర ప్రధాన ప్రాంతాలు అయిన ఎల్బీనగర్ - సరూర్ న‌గర్ సహా చుట్టు పక్కల ఉన్న చెరువులు అన్ని నిండిపోయి కాలనీ ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వ‌ర‌ద పోటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సైతం త‌ప్పలేదు. ఆయన కారు వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో లోత‌ట్టు ప్రాంతాల్లో నీట మునిగిన కాల‌నీలు ప‌రిశీలించి... ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు.TRS MLA Car{#}Bojjala Venkata Sudhir Reddy;Jubilee Hills;Reddy;Hyderabad;Varsham;Capital;Car;MLAవ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు..!వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు..!TRS MLA Car{#}Bojjala Venkata Sudhir Reddy;Jubilee Hills;Reddy;Hyderabad;Varsham;Capital;Car;MLAThu, 15 Jul 2021 17:55:00 GMTతెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ కు వరదలు వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాల  ప్రజలే కాకుండా ప్రధాన ప్రాంతాల్లో సైతం వర్షపు నీరు నిలిచిపోవడంతో నగర ప్ర‌జ‌లు పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లో ఒక మోస్త‌రు వర్షం పడితే నగరంలో ప్రధాన రహదారులు పెద్దపెద్ద కాలువలను తలపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా కురుస్తున్న వర్షాలు నగర ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం అతలా కుత‌లం చేస్తున్నాయి. గ‌త‌ మూడు రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కుండపోత వర్షాలకు నగర ప్రధాన ప్రాంతాలు అయిన ఎల్బీనగర్ - సరూర్ న‌గర్ సహా చుట్టు పక్కల ఉన్న చెరువులు అన్ని నిండిపోయి కాలనీ ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వ‌ర‌ద పోటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సైతం త‌ప్పలేదు. ఆయన కారు వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో లోత‌ట్టు ప్రాంతాల్లో నీట మునిగిన కాల‌నీలు ప‌రిశీలించి... ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు.

ఈ క్ర‌మంలోనే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం లోని హస్తినాపురం డివిజన్ లో పర్యటిస్తుండగా కారు వ‌ర‌ద నీటిలో కూరుకు పోయింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారును అతి కష్టం మీద వరదలో నుంచి బయటకు తీశారు. ఇక బ‌స్తీలు, కాల‌నీలే కాకుండా ప్ర‌ధాన ప్రాంతాలు అయిన కూక‌ట్ ప‌ల్లి - నిజాంపేట - ప్ర‌గ‌తి న‌గ‌ర్ - శేరిలింగం ప‌ల్లి - జూబ్లిహిల్స్ - బంజారా హిల్స్ లో ప‌లు ప్రాంతాల్లోనూ ఇళ్లు నీట మునిగి పోయాయి. సెల్లార్లు అని నిండి పోయి చిన్న సై జు చెరువ‌ల్లా ఉన్నాయి. ఇళ్లు మునిగిన చోట్ల ప్ర‌జ‌లు పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.

 



వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు

టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

ఆ వైసీపీ ఎమ్మెల్యే స్పీడ్‌కు బ్రేకుల్లేవ్‌... వార‌సుడు కూడా లైన్లోనే ?

మంత్రి అనిల్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... కొత్త ర‌చ్చ షురూ ?

లోకేష్ కి సైలెంట్ గా దెబ్బేస్తున్న జూనియర్... ?

హైదరాబాద్ లో పాత భవనాలలో ఉన్నారా...?

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ పిలుపు..క‌లిసిపోరాడుదాం.. !

కొడుకుతో స‌మంత ఆట‌లు మామూలుగా లేవుగా..!

ఎమ్మెల్యే తమ్ముడితో గొడవ, అధికారికి ఉన్నతాధికారులు షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>