MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-abbavaram-birthday-speciala7ccaed4-9a72-4bae-beb2-7ac391134f8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-abbavaram-birthday-speciala7ccaed4-9a72-4bae-beb2-7ac391134f8e-415x250-IndiaHerald.jpgమామూలుగా చాలా మంది కథానాయకులు నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. వారి నటనను మరింత మెరుగు పరుచుకుంటూ అందిన అవకాశాలను చేసుకుంటూ పోతారు. ఎక్కువగా రిస్కీ ఫాక్టర్స్ జోలికి వెళ్లరు. కానీ కొందరు హీరోలకు మాత్రం నటన మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగం వంటి విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. KIRAN ABBAVARAM BIRTHDAY SPECIAL{#}kiran;kadapa;Sri Venkateswara swamy;Rayalaseema;NTR Kathanayakudu;Telugu;Yuva;Chitram;Hero;Reddy;Cinema;jobనా సినిమాకు నేనే కథ రాసుకున్నా... ?నా సినిమాకు నేనే కథ రాసుకున్నా... ?KIRAN ABBAVARAM BIRTHDAY SPECIAL{#}kiran;kadapa;Sri Venkateswara swamy;Rayalaseema;NTR Kathanayakudu;Telugu;Yuva;Chitram;Hero;Reddy;Cinema;jobThu, 15 Jul 2021 08:53:46 GMTమామూలుగా చాలా మంది కథానాయకులు నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. వారి నటనను మరింత మెరుగు పరుచుకుంటూ అందిన అవకాశాలను చేసుకుంటూ పోతారు. ఎక్కువగా రిస్కీ ఫాక్టర్స్ జోలికి వెళ్లరు. కానీ కొందరు హీరోలకు మాత్రం నటన మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగం వంటి విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. రిస్క్ చేయడం ఎందుకులే అనుకోరు. తమ ప్రతిభను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిలో ఒకరు తెలుగు యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. నేడు అతడి పుట్టిన రోజు కావడంతో మీడియాతో కొన్ని విషయాలను ముచ్చటించారు. తన ఆలోచనలను వ్యక్తపరిచారు. అవేంటో ఇపుడు చూద్దాం.

కడప జిల్లాలోని రాయచోటికి చెందిన  కిరణ్ ఇంజినీరింగ్‌ కంప్లీట్ కాగానే బెంగళూరు వెళ్లి  రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారట. అదే సమయంలో తన స్నేహితుడి సహాయంతో గచ్చిబౌలి అనే షార్ట్ ఫిలింలో అతను నటించాడు. ఆ తరువాత ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో అనుకోకుండా అవకాశం వచ్చిందట. అలా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం  బాలాజీ డైరెక్షన్ లో ‘సెబాస్టియన్‌’ చిత్రం చేస్తున్నట్లు తెలిపారు.  అలాగే  ‘సమ్మతమే" అనే ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నట్లు  తెలిపారు. గోపీనాథ్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ యంగ్ హీరో కి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు అంటే చాలా ఇష్టమట. కానీ ఈ కథలు తాను చేయగలనా లేదా ? అని ఏమాత్రం ఆలోచన లేకుండా  దర్శకులు నా వరకు రావడం జరగదు  కదా అన్నారు కిరణ్.  

అందుకే ముందు తనని తాను  నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతో తానే స్వతహాగా ఈ యాంగిల్ లో ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు కిరణ్.  అదే  ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’. దీనికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అన్నిటినీ కిరణ్ నే  అందించినట్లు స్వయంగా తెలిపారు. శ్రీధర్‌ గాదె ఈ చిత్రానికి దర్శకుడు.  1975లో రాయలసీమ ప్రాంతంలో నిర్మించిన ఓ కళ్యాణ మండపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కిరణ్  తండ్రిగా నటుడు సాయికుమార్‌ ఇందులో నటించారు. ఆగస్టు 6న థియేటర్లోనే ఈ చిత్రం నేరుగా విడుదల కాబోతున్నట్లు ఈ సందర్బంగా  కిరణ్ తెలియచేశారు. ఏదేమైనా ఈ యువ కథానాయకుడి ప్రయత్నం ఫలించాలని, మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.



పెళ్లి అంటే పారిపోతున్న హీరోయిన్స్.. ఎందుకంటే..!?

మాట నిలబెట్టుకోలేకపోతున్న జగన్.. మరో అవమానం..!

అందరిని స్ఫూర్తి కలిగించే సినిమా.. రాఘవ లారెన్స్ స్టైల్..!!

నువ్వు లేక నేను లేను సినిమా మహేష్ ఎలా మిస్ అయ్యాడు..!

తెలంగాణ స్టూడెంట్‌కు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్..?

సర్జరీ చేయించుకున్న నటి..కారణం !

ఆశ, నిరాశల ఉయ్యాలట "ఊపిరి"

మహేష్ ఆదిపత్యం పై షాకింగ్ న్యూస్ !

మామూలుగా చాలా మంది కథానాయకులు నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. వారి నటనను మరింత మెరుగు పరుచుకుంటూ అందిన అవకాశాలను చేసుకుంటూ పోతారు. ఎక్కువగా రిస్కీ ఫాక్టర్స్ జోలికి వెళ్లరు. కానీ కొందరు హీరోలకు మాత్రం నటన మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగం వంటి విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>