PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpgపార్టీ ప‌రంగా చూసుకుంటే.. కార్య‌క‌ర్త‌ల‌కు కూడా భూమ‌న అందుబాటులో ఉంటున్నారు. ఆయ‌న మంత్రి పెద్దిరెడ్డి హ‌వాకు అడ్డు చెప్ప‌కుండానే తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండానే ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా గ‌త ప్ర‌భుత్వంలో ప్రారంభించి నిలిచిపోయిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక‌, టీడీపీ విష‌యాన్ని చూసుకుంటే.. మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ వ‌ర్గ పోరుYSRCP{#}TDP;MP;MLA;District;Party;YCP;Ministerఆ వైసీపీ ఎమ్మెల్యే స్పీడ్‌కు బ్రేకుల్లేవ్‌... వార‌సుడు కూడా లైన్లోనే ?ఆ వైసీపీ ఎమ్మెల్యే స్పీడ్‌కు బ్రేకుల్లేవ్‌... వార‌సుడు కూడా లైన్లోనే ?YSRCP{#}TDP;MP;MLA;District;Party;YCP;MinisterThu, 15 Jul 2021 17:17:00 GMTచిత్తూరు జిల్లా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి త‌న‌దైన శైలిలో దూసుకు పోతున్నారు. త‌న సీనియార్టీకి త‌గిన విధంగా గుర్తింపు లేద‌నే అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ బ‌ల‌ప‌డ‌కుండా చూసుకునే క్ర‌మంలో నిత్యం ప్ర‌జ‌ల మ‌ద్య ఉంటున్నారు. వారి క‌ష్టసుఖాలు పంచుకుంటున్నారు. అదే స‌మ‌యంలో క‌రోనా నేప‌థ్యంలోనూ ఆయ‌న సేవ‌లు అందిస్తున్నారు. అనాథ క‌రోనా మృతులకు అంత్య క్రియ‌లు చేయ‌డంలోను, క‌రోనా బాధితుల‌ను ఆదుకోవ‌డంలోను క‌రుణాక‌ర్‌రెడ్డి ముందున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

పార్టీ ప‌రంగా చూసుకుంటే.. కార్య‌క‌ర్త‌ల‌కు కూడా భూమ‌న అందుబాటులో ఉంటున్నారు. ఆయ‌న మంత్రి పెద్దిరెడ్డి హ‌వాకు అడ్డు చెప్ప‌కుండానే తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండానే ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా గ‌త ప్ర‌భుత్వంలో ప్రారంభించి నిలిచిపోయిన అభివృద్ధి ప‌నుల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక‌, టీడీపీ విష‌యాన్ని చూసుకుంటే.. మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ వ‌ర్గ పోరుతో అల్లాడుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో ఆమె స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. అయితే మొన్న తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఇక్క‌డ వైసీపీకి ఏకంగా 35 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. కార్పొరేష‌న్లోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్ర‌మంలో టీడీపీలో నెల‌కొన్ని అసంతృప్తుల‌తో పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. సంస్థాగ‌తంగా టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉండ‌డంతో.. ఇక్క‌డ టీడీపీ ఎప్పుడైనా పుంజుకునే అవ‌కాశం ఉంద‌నేది వాస్త‌వం. దీనిని గ్ర‌హించిన క‌రుణాక‌ర్ రెడ్డి.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఏక‌తాటిపైకి తెచ్చి.. కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

దీంతో వైసీపీ జోరు ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూసుకుంటు న్నారు. మ‌రోవైపు త‌న వార‌సుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువ‌చ్చి యువ‌త‌నుకూడా ఆక‌ర్షిస్తున్నారు. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో క‌రుణాక‌ర్‌రెడ్డి కుమారుడు విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. అన్ని వైపుల నుంచి కూడా క‌రుణాక‌ర్‌రెడ్డి త‌న హ‌వాను పెంచుకునేందుకు ప్రాధాన్యంఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 



తాడేపల్లిలో ఏం జరుగుతోంది..?

తిరుప‌తి అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే క‌రుణాక‌ర్ రెడ్డి ముద్ర‌

మంత్రి అనిల్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... కొత్త ర‌చ్చ షురూ ?

సాయిరెడ్డి వ‌ర్సెస్ గ‌జ‌ప‌తిరాజు.. విన్న‌రెవ‌రు..?

ప‌వ‌న్ మ‌ళ్లీ బాబు ట్రాప్‌లో ప‌డ్డాడా... ఈ సారి ఇంతే సంగ‌తులు ?

మ‌రో యాత్ర‌కు రెడీ అవుతోన్న చంద్ర‌బాబు...!

పంజాబ్ కాంగ్రెస్ అసమ్మతి సద్దుమణిగినట్టేనా..?

జూ.ఎన్టీఆర్ స్లోగన్స్ వెనుక పెద్ద వ్యూహం..?

పవన్ పాలి ' ట్రిక్స్‌ ' తో జుట్టు పీక్కుంటోన్న జ‌న సైనికులు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>