Bandaru Dattatreya: హ‌ర్యానా గ‌వ‌ర్నర్‌గా బండారు ద‌త్తాత్రేయ ప్రమాణ స్వీకారం

Bandaru Dattatreya, Governor of haryan: ఏపీ బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమించారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ ఛగన్‌భాయ్ పటేల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ ఇటీవల నియమితులయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2021, 04:42 PM IST

Trending Photos

Bandaru Dattatreya takes oath as Haryana Governor: హ‌ర్యానా గ‌వ‌ర్నర్‌గా సీనియర్ నేత బండారు ద‌త్తాత్రేయ గురువారం ప్రమాణం చేశారు. సత్యదేవ్ నారాయణ్ ఆర్య నుంచి బాధ్యతలు స్వీకరించారు. హ‌ర్యానా హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ర‌వి శంక‌ర్ ఝా, ద‌త్తాత్రేయతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించడం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ క్రమంలో 2019లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)ను హర్యానాకు బదిలీ చేశారు. ఈ క్రమంలో నేడు దత్తన్న హర్యానా 18వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, ప‌లువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్‌గా సేవలందిస్తున్న సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపురకు బదిలీ అయ్యారు.

కాగా, ఏపీ బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు(Hari Babu Kambhampati)ను మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమించారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ ఛగన్‌భాయ్ పటేల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌, గోవా గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్ బైస్‌‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories