PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress2a503203-de79-4bcc-a69e-8084b5430c72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress2a503203-de79-4bcc-a69e-8084b5430c72-415x250-IndiaHerald.jpgదాదాపు ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ బిజీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసమున్న టెన్ జన్ పద్ కు మళ్లీ నేతల తాకిడి పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటే పొరపాటే. గాంధీ త్రయంతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. Rahul Ghandi{#}prasanth;Sharad Pawar;Mamta Mohandas;Prashant Kishor;rahul;Rahul Sipligunj;Bihar;Kumaar;Mohandas Karamchand Gandhi;West Bengal - Kolkata;Assembly;SoniaGandhi;CM;Bharatiya Janata Party;media;Congressమళ్లీ టెన్ జన్ పద్ బిజీ బిజీమళ్లీ టెన్ జన్ పద్ బిజీ బిజీRahul Ghandi{#}prasanth;Sharad Pawar;Mamta Mohandas;Prashant Kishor;rahul;Rahul Sipligunj;Bihar;Kumaar;Mohandas Karamchand Gandhi;West Bengal - Kolkata;Assembly;SoniaGandhi;CM;Bharatiya Janata Party;media;CongressThu, 15 Jul 2021 21:07:00 GMTదాదాపు ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ బిజీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసమున్న టెన్ జన్ పద్ కు మళ్లీ నేతల తాకిడి పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటే పొరపాటే. గాంధీ త్రయంతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరుగుతుందని... అటు నేషనల్ మీడియా నుంచి యూ ట్యూబ్ ఛానల్స్ వరకు తెగ విశ్లేషణలు చేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... ఆ తర్వాత     ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు పని చేశారు. ఆయనే ఇప్పుడు గాంధీ త్రయంతో సమావేశం కావడం... లెటెస్ట్ న్యూస్.

ఏడేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ... 2024లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం అవకాశం ఉన్న ప్రతి అస్త్రాన్ని వాడేస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అటు బీహార్ లో కొద్ది రోజుల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. సీఎం నితీష్ కుమార్ తో విభేదించి . అధికార జేడీఎస్ నుంచి బయటకు వచ్చారు. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అదే సమయంలో బెంగాల్ లో బీజేపీకి వంద సీట్లు కూడా రావని ఛాలెంజ్ కూడా చేశారు. అయితే బెంగాల్ ఫలితాల అనంతరం అనూహ్యంగా రాజకీయ వ్యూహకర్తగా ఇకపై ఉండనని సంచలన ప్రకటన కూడా చేశారు.

అలా ప్రకటించిన రెండు నెలలకే ప్రశాంత్ కిషోర్.... రాహుల్ గాంధీతో భేటీ కావడం సంచలనంగా మారింది. స్వయంగా రాహుల్ ఇంటికి వచ్చిన పీకే.. గాంధీ త్రయంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చలో ఏ విషయాలు వచ్చాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే గాసిప్స్ మాత్రం భారీగానే వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పీకే టీమ్ పని చేస్తుందని కొందరంటుంటే... కాదు కాదు బీహార్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పీకే అంటున్నారు మరికొందరు. అలా కాదు శరద్ పవార్ ను రాష్ట్రపతి పదవి కోసం పీకే ప్రయత్నిస్తున్నారనేది ఇంకొందరి మాట. ఏది ఏమైనప్పటికీ... 2024లో బీజేపీని గద్దె దింపి.. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకే పీకే టీమ్ పనిచేస్తుందనేది ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో.



మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!

బిజినెస్ : లక్షల్లో ఉద్యోగం వదిలి.. కోళ్ల వ్యాపారం..

కొండా దంపతుల మౌన రాగం!

నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?

బల్దియా బీజేపీలో పదవి పరేషాన్‌!

హుజురాబాద్‌ ఉప ఎన్నిక : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇతనే ?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న భానుప్రియ చెల్లి.. ఎవరి సినిమాలో తెలుసా ?

రకుల్ కట్టిన చీర రేట్ ఎంతో తెలిస్తే చుక్కలే

తాడేపల్లిలో ఏం జరుగుతోంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>