PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpaf35d927-42b7-40ec-b707-ec1b9f3f7bc5-415x250-IndiaHerald.jpgబల్దియా బీజేపీలో ఓ చర్చ ఆసక్తికరంగాా సాగుతోంది. అదేమిటంటే.. ఆ పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్లలో ఎవరికి బీజేపీ ఫ్లోర్ లీడర్‌ పదవి లభిస్తే.. వారు మున్ముందు ఎమ్మెల్యే పోస్టుకు పోటీపడే అవకాశముందట. అందుకే ఆ పదవి కోసం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చుట్టు, ఇటు కేంద్ర కిషన్‌ రెడ్డి చుట్టూ ఆశావహులంతా చక్కర్లు కొడుతున్నారట. నెలలుగా సాగుతున్న ఈ పంచాయితీ తీరకపోవడంతో కార్పొరేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. తమ చేతిలో ఓడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కార్పొరేటర్లుగా హవా సాగిస్తుంటే గెలిచిన తామేమో అటtbjp{#}central government;Bharatiya Janata Party;MLA;Reddy;Partyబల్దియా బీజేపీలో పదవి పరేషాన్‌!బల్దియా బీజేపీలో పదవి పరేషాన్‌!tbjp{#}central government;Bharatiya Janata Party;MLA;Reddy;PartyThu, 15 Jul 2021 19:16:32 GMTబల్దియా బీజేపీలో ఓ చర్చ ఆసక్తికరంగాా సాగుతోంది. అదేమిటంటే.. ఆ పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్లలో ఎవరికి బీజేపీ ఫ్లోర్ లీడర్‌ పదవి లభిస్తే.. వారు మున్ముందు ఎమ్మెల్యే పోస్టుకు పోటీపడే అవకాశముందట. అందుకే ఆ పదవి కోసం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చుట్టు, ఇటు కేంద్ర కిషన్‌ రెడ్డి చుట్టూ ఆశావహులంతా చక్కర్లు కొడుతున్నారట. నెలలుగా సాగుతున్న ఈ పంచాయితీ తీరకపోవడంతో కార్పొరేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. తమ చేతిలో ఓడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కార్పొరేటర్లుగా హవా సాగిస్తుంటే గెలిచిన తామేమో అటు అధికారుల నుంచి ఇటు అధికార పార్టీ నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందట.

అసలు ఫ్లోర్‌ లీటర్‌ పదవి ఎవరికి అనేది నిర్ణయించడంలో ఎందుకంత ఆలస్యం జరుగుతోంది అనే చర్చ గ్రేటర్‌ బీజేపీలో జోరుగా జరుగుతోంది. నిమిషాల్లో తేల్చాల్సిన విషయాన్ని నెలల తరబడి సాగదీస్తుండటంతో పార్టీ కార్పొరేటర్లను చికాకు పెడుతోందని సమాచారం.. భాగ్యలక్ష్మి టెంపుల్‌ దగ్గర ప్రమాణం చేసి బల్దియాను బాగు చేద్దామనుకున్నవారి ఆశలు పార్టీ పెద్దల తీరుతో అడియాసలు అవుతున్నాయని కమలనాథుల అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు.

నిజానికి 150 సీట్లున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి  48 కార్పొరేటర్లు గెలుపొందడం ఓ రికార్డు. లింగోజిగూడ కార్పొరేటర్‌  ఉప ఎన్నికలో సిట్టింగ్‌ సీటును కోల్పోవడం వేరే మ్యాటర్‌. అయితే 47 మంది కార్పొరేటర్లతో బలంగా ఉన్న బీజేపీ.. తమ ఫ్లోర్‌ లీడర్‌ను ఇంకా ఎన్నుకోకపోవడం గ్రేటర్‌ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బల్దియాలో కెప్టెన్‌ లేని జట్టుగా బీజేపీ కార్పొరేటర్లు ఇంటా బయటా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందట. అటు అధికారులు పనుల విషయంలో స్పందించకపోవడం, ఇటు అధికారపార్టీ నేతలు తమ చేతిలో ఓడిపోయి కూడా దర్జాగా అనధికారిక కార్పొరేటర్లుగా చలామణి అవుతుండటంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక సిటీ కమలదళ ప్రజాప్రతినిధులు పరేషాన్‌ అవుతున్నారట.



హుజురాబాద్‌ ఉప ఎన్నిక : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇతనే ?

ఎమ్మెల్సీగా స‌జ్జ‌ల‌... వైసీపీలో మూడేది ఎవ‌రికో ?

వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు..!

తాడేపల్లిలో ఏం జరుగుతోంది..?

ఆ వైసీపీ ఎమ్మెల్యే స్పీడ్‌కు బ్రేకుల్లేవ్‌... వార‌సుడు కూడా లైన్లోనే ?

మంత్రి అనిల్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... కొత్త ర‌చ్చ షురూ ?

ప‌వ‌న్ మ‌ళ్లీ బాబు ట్రాప్‌లో ప‌డ్డాడా... ఈ సారి ఇంతే సంగ‌తులు ?

మ‌రో యాత్ర‌కు రెడీ అవుతోన్న చంద్ర‌బాబు...!

జూ.ఎన్టీఆర్ స్లోగన్స్ వెనుక పెద్ద వ్యూహం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>